AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బెడ్ రూంలో మాత్రమే జరిగే 3 విషయాలు.. లైవ్ షోలో షాకిచ్చిన సానియా మీర్జా.. ఆన్సర్ వింటే మైండ్ బ్లాంకే

Sania Mirza Viral Bedroom Question: సానియా మీర్జాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఒక సెలబ్రిటీని "బెడ్ రూమ్‌లో మాత్రమే జరిగే మూడు విషయాలు" చెప్పాలంటూ అడిగిన సానియా.. ఆ తర్వాత సమాధానాలు విని ముక్కున వేలేసుకుంది. కాగా, ఈ వీడియో షోయబ్ మాలిక్‌ కలిసి జీవించిన సమయంలో నిర్వహించిన ది మీర్జా మాలిక్ షో కోసం షూట్ చేశారు. వీరిద్దరి విడాకుల తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Video: బెడ్ రూంలో మాత్రమే జరిగే 3 విషయాలు.. లైవ్ షోలో షాకిచ్చిన సానియా మీర్జా.. ఆన్సర్ వింటే మైండ్ బ్లాంకే
Sania Mirza Viral Bedroom Question
Venkata Chari
|

Updated on: Mar 06, 2025 | 5:41 PM

Share

Sania Mirza Viral Bedroom Question: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ప్రస్తుతం షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకుని, కొడుకుతో కలిసి జీవిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ కోసం ఎల్లప్పుడూ అప్‌డేట్స్ ఇస్తోంది. సానియా ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియో సానియా, షోయబ్ మాలిక్ కలిసి ది మీర్జా మాలిక్ షోను నిర్వహించిన సమయంలోది కావడం గమనార్హం. ఈ షో సమయంలో సానియా అడిగిన ఓ ప్రశ్న సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ షోలో పాల్గొన్న ఓ సెలబ్రిటీని ‘బెడ్ రూమ్‌లో మాత్రమే జరిగే మూడు విషయాలు’ ఏంటి అనే ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్‌గా ఉంది. కానీ, ఆన్సర్ చేయడానికి మాత్రం ఇబ్బంది పడతారు అని అంతా అనుకున్నారు. కానీ, ఆ అమ్మాయి చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కి గురిచేసిందనడంలో ఎలాంటి సదేహం లేదు. ‘నిద్రపోతాను, తింటాను, టీవీ చూస్తాను’ అంటూ సానియా మీర్జా, సోషబ్ మాలిక్‌కే షాకిచ్చేసింది. ఆమె ఆన్సర్ విన్న వీరిద్దరు బెడ్ రూంలో చేసే పనులు ఇవేనా అంటూ నవ్వుకున్నారు.

ఆ వెంటనే సానియా ఆశ్చర్యంగా, “ఏ సమయంలో బెడ్ రూమ్‌లో ఆహారం తింటారో” అంటూ మరో ప్రశ్న అడిగింది. అప్పుడు సదరు అమ్మాయి తన రాత్రి అలవాట్ల గురించి చెప్పి, మంచం మీదనే కూర్చుని టీవీ చూస్తూ, ఆహారం తింటూ ఆనందిస్తానని చెప్పుకొచ్చింది. ఈ సమాధానం విని, షోలో ఉన్న వారందరూ పగలబడి నవ్వడం చూడొచ్చు.

కాగా, ఈ వీడియో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కలిసి జీవించిన సమయంలో షూట్ చేశారు. ఆ సమయంలో ది మీర్జా మిల్క్ షో అనే షోను ప్రారంభించారు. ప్రస్తుతం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. కానీ, ఈ పాత వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సానియా మీర్జా తన టెన్నిస్‌లో సాధించిన విజయాలకు మాత్రమే కాదు, తన వ్యక్తిత్వంతోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

సానియా మీర్జా కెరీర్ యువ టెన్నిస్ ఆటగాళ్లకు ఒక ప్రేరణగా నిలిచింది. ఇది ఏ ప్రొఫెషనల్ ఆటగాడి జీవితం క్రీడకే పరిమితం కాదని చూపిస్తుంది. సానియా విజయ రహస్యం ఆమె కృషి, టెన్నిస్ కోర్టులో అసమానమైన ప్రదర్శన ఆమెకు ప్రపంచవ్యాప్తంగా సముచిత స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ప్రస్తుతం ఆమె విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..