PKL 2023 Points Table: ట్రోఫీ దిశగా దూసుకెళ్తోన్న గుజరాత్.. వరుస విజయాలతో టాప్ ప్లేస్..

ఇప్పటి వరకు, పాట్నా పైరేట్స్ అత్యధికంగా మూడుసార్లు ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్‌గా నిలిచింది. జైపూర్ పింక్ పాంథర్స్ రెండు సార్లు PKL ట్రోఫీని గెలుచుకుంది. ఇది కాకుండా యూ ముంబా, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ ఒక్కోసారి PKL ఛాంపియన్‌గా నిలిచాయి. ప్రతి సిటీలో శుక్రవారం ప్రారంభమవుతుంటాయి. ఇప్పటికే అహ్మదాబాద్‌లో తొలి లెగ్ మొదలైంది. గురువారం విశ్రాంతి రోజు అవుతుంది. ఈ ఏడాది కొత్త ఛాంపియన్‌ అవతరిస్తారా లేక పాత జట్టు మరోసారి టైటిల్‌ను గెలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

PKL 2023 Points Table: ట్రోఫీ దిశగా దూసుకెళ్తోన్న గుజరాత్.. వరుస విజయాలతో టాప్ ప్లేస్..
Pkl 2023 Points Table
Follow us
Venkata Chari

|

Updated on: Dec 11, 2023 | 9:02 AM

Pro Kabaddi 2023: ప్రో కబడ్డీ 2023 10వ సీజన్ (PKL 10) చాలా ఉత్సాహంగా సాగుతోంది. లీగ్ దశ మ్యాచ్‌లు 2 డిసెంబర్ 2023 నుంచి 21 ఫిబ్రవరి 2024 వరకు జరగనున్నాయి. కాగా, చాలా ఏళ్లు, రెండు సీజన్ల తర్వాత తొలిసారిగా 12 వేర్వేరు నగరాల్లో పీకేఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రో కబడ్డీ 2023 లీగ్ దశ మ్యాచ్‌లు అహ్మదాబాద్, బెంగళూరు, పూణె, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతా, పంచకులలో నిర్వహించనున్నారు.

ప్రతి మ్యాచ్ గెలిచిన జట్టుకు 5 పాయింట్లను పొందుతుంది. ఓడిన జట్టు ఓటమి మార్జిన్‌ను 7 లేదా అంతకంటే తక్కువ వద్ద ఉంచుకుంటే, ఆ జట్టుకు కూడా ఒక పాయింట్ వస్తుంది. ఇది కాకుండా, టై అయితే, రెండు జట్లకు చెరో 3 పాయింట్లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో టాప్ 6లో నిలిచిన జట్లు నేరుగా ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తాయి.

Pro Kabaddi 2023: PKL 10 పాయింట్ల పట్టిక (Points Table)

1) గుజరాత్ జెయింట్స్: (మ్యాచ్‌లు – 4, గెలుపు – 3, ఓటమి – 1, టై – 0, పాయింట్లు – 16)

2) బెంగాల్ వారియర్స్: (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓటమి – 0, టై – 1, పాయింట్లు – 13)

3) యుపి యోధాస్: (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓటమి – 1, టై – 0, పాయింట్లు – 11)

4) పాట్నా పైరేట్స్: (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓటమి – 0, టై – 0, పాయింట్లు – 10)

5) పుణెరి పల్టన్: (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓటమి – 0, టై – 0, పాయింట్లు – 10)

6) హర్యానా స్టీలర్స్: (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓటమి – 1, టై – 0, పాయింట్లు – 10)

7) దబాంగ్ ఢిల్లీ KC: (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, టై – 0, పాయింట్లు – 6)

8) యు ముంబా: (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, టై – 0, పాయింట్లు – 6)

9) తమిళ్ తలైవాస్: (మ్యాచ్‌లు – 2, గెలుపు – 1, ఓటమి – 1, టై – 0, పాయింట్లు – 5)

10) జైపూర్ పింక్ పాంథర్స్: (మ్యాచ్‌లు – 2, గెలుపు – 0, ఓటమి – 1, టై – 1, పాయింట్లు – 4)

11) బెంగళూరు బుల్స్: (మ్యాచ్‌లు – 4, గెలుపు – 0, ఓటమి – 4, టై – 0, పాయింట్లు – 4)

12) తెలుగు టైటాన్స్: (మ్యాచ్‌లు – 3, గెలుపు – 0, ఓటమి – 3, టై – 0, పాయింట్లు – 1)

ఇప్పటి వరకు, పాట్నా పైరేట్స్ అత్యధికంగా మూడుసార్లు ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్‌గా నిలిచింది. జైపూర్ పింక్ పాంథర్స్ రెండు సార్లు PKL ట్రోఫీని గెలుచుకుంది. ఇది కాకుండా యూ ముంబా, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ ఒక్కోసారి PKL ఛాంపియన్‌గా నిలిచాయి. ప్రతి సిటీలో శుక్రవారం ప్రారంభమవుతుంటాయి. ఇప్పటికే అహ్మదాబాద్‌లో తొలి లెగ్ మొదలైంది. గురువారం విశ్రాంతి రోజు అవుతుంది. ఈ ఏడాది కొత్త ఛాంపియన్‌ అవతరిస్తారా లేక పాత జట్టు మరోసారి టైటిల్‌ను గెలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..