PM Narendra Modi: రికార్డ్ ప్రదర్శనతో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు: పారాలింపిక్ పతక విజేతలతో ప్రధాని మోదీ

భారతదేశం ఇప్పటివరకు పారిస్ పారాలింపిక్స్ 2024లో 6 బంగారు పతకాలతో సహా మొత్తం 26 పతకాలను గెలుచుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో 14వ స్థానంలో ఉంది. పారాలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ మొత్తం 19 పతకాలు సాధించింది.

PM Narendra Modi: రికార్డ్ ప్రదర్శనతో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు: పారాలింపిక్ పతక విజేతలతో ప్రధాని మోదీ
Pm Modi Paraolympics
Follow us

|

Updated on: Sep 07, 2024 | 7:42 AM

పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత పారా అథ్లెట్ల పటిష్ట ప్రదర్శన యావత్ దేశాన్ని సంతోషపెట్టింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత ఆటగాళ్లు ఇప్పటివరకు 26 పతకాలు సాధించారు. పారా అథ్లెట్ల విజయాలపై సామాన్య అభిమానులే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆటగాళ్లను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్రమంలో గత రెండు రోజులుగా పతక విజేతలు హర్విందర్ సింగ్, సచిన్ ఖిలారీ, కపిల్ పర్మార్, ప్రణబ్ సుర్మా, ధరంబీర్‌లతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ పతక విజేతల విజయాన్ని ప్రధాని దేశానికి బహుమతిగా అభివర్ణించారు.

పారాలింపిక్ పతకాలు దేశానికి బహుమతి..

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. టోక్యో ఒలింపిక్స్‌లో వచ్చిన 7 పతకాలను కూడా భారత క్రీడాకారులు పునరావృతం చేయలేకపోయారు. భారత అథ్లెట్లు 6 పతకాలు సాధించి పారిస్ నుంచి తిరిగి వచ్చారు. అందులో ఒక్క బంగారు పతకం కూడా లేదు. పారాలింపిక్స్‌లో కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ భారత ఆటగాళ్లు టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాల రికార్డును కూడా బద్దలు కొట్టారు. ప్రధాని మోదీ కూడా భారత అథ్లెట్లతో నిరంతరం మాట్లాడుతున్నారు. వారి విజయానికి అభినందిస్తూ, ఇతర ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు.

సెప్టెంబర్ 6, శుక్రవారం పతక విజేతలతో ప్రధాని మోదీ మాట్లాడారు. పారా ఆర్చరీ స్వర్ణ పతక విజేత హర్విందర్ సింగ్, షాట్‌పుట్ విజేత సచిన్ ఖిలారీ, ఇతర పతక విజేతలతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి, వారి విజయానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా, ఆటగాళ్ల ధైర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడారు. ఈ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలో కీలక పాత్ర పోషించిన కోచ్‌లందరినీ ప్రధాని ప్రశంసించారు. వారి కృషిని ప్రశంసించారు. హర్విందర్, సచిన్‌లతో పాటు జూడోలో భారత్‌కు తొలిసారిగా పతకం సాధించిన కపిల్ పర్మార్, క్లబ్ త్రోలో ఆసియా రికార్డుతో స్వర్ణం సాధించిన ధరంబీర్, రజత పతకం సాధించిన ప్రణవ్ సుర్మాతో కూడా ప్రధాని మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు రికార్డు ప్రదర్శన..

భారత్ ఇప్పటి వరకు మొత్తం 26 పతకాలు సాధించగా అందులో 6 స్వర్ణం, 9 రజతం, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 14వ స్థానంలో ఉండగా, మిగిలిన 2 రోజుల్లో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6, శుక్రవారం, భారత ఖాతాలో 6వ బంగారు పతకం చేరింది. ఇక్కడ పురుషుల T64 కేటగిరీ హైజంప్‌లో ప్రవీణ్ కుమార్ ఆసియా రికార్డుతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రవీణ్ 2.08 మీటర్ల ఎత్తు జంప్ చేసి ఈ స్వర్ణం సాధించాడు. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో గెలిచిన రజత పతకాన్ని రంగు మార్చాలనే లక్ష్యాన్ని విజయవంతంగా సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రికార్డ్ ప్రదర్శనతో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు: ప్రధాని మోదీ
రికార్డ్ ప్రదర్శనతో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు: ప్రధాని మోదీ
ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌.. అసలు ఇవి నిజంగానే పని చేస్తాయా?
ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్‌.. అసలు ఇవి నిజంగానే పని చేస్తాయా?
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
ద్రవిడ్ రాకతో ఆ దిగ్గజానికి ఊహించని షాక్.. కోల్‌కతా వైపు చూపు?
ద్రవిడ్ రాకతో ఆ దిగ్గజానికి ఊహించని షాక్.. కోల్‌కతా వైపు చూపు?
56 ఏళ్ల తర్వాత తొలిసారి.. చరిత్ర సృష్టించిన భారత్..
56 ఏళ్ల తర్వాత తొలిసారి.. చరిత్ర సృష్టించిన భారత్..
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
చవితినాడు షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే?
చవితినాడు షాకిచ్చిన బంగారం.. తులం ఎంత పెరిగిందంటే?
Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త..
అంచనాలు పెంచేస్తున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌.! ఇక్కడ నిలిచేది ఎవరు?
అంచనాలు పెంచేస్తున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌.! ఇక్కడ నిలిచేది ఎవరు?
ఈ రెండుజెళ్ళ అమాయకపు నవ్వుల చిన్నారి ఎవరో తెలుసా.?
ఈ రెండుజెళ్ళ అమాయకపు నవ్వుల చిన్నారి ఎవరో తెలుసా.?
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం. టెక్సాస్‌ లో హైదరాబాదీలు మృతి
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..
కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..