AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australian Open 2025: వరుసగా 2వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన యానిక్‌ సినర్‌..

Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల టైటిల్ యానిక్‌ సినర్‌ పేరులోనే ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించాడు. దీంతో టైటిల్‌ను కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. యానిక్‌ సినర్‌ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.

Australian Open 2025: వరుసగా 2వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన యానిక్‌ సినర్‌..
Jannik Sinner Beat Alexande
Venkata Chari
|

Updated on: Jan 26, 2025 | 6:24 PM

Share

Australian Open 2025 Final: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో పురుషుల ఫైనల్ మ్యాచ్ ప్రపంచ ర్యాంక్ యానిక్‌ సినర్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగింది. యానిక్‌ సినర్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను కూడా కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గత రెండు వారాలుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఇది అతని ఆటపై ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో సఫలమయ్యాడు.

ఫైనల్‌లో ఏకపక్షంగా గెలిచిన యానిక్ సినర్..

ఈ మ్యాచ్‌లో యానిక్ సినర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు ఘోర పరాజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో యానిక్ సిన్నర్ 6-3, 7-6 (4), 6-3తో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఈ మ్యాచ్ 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది. గత 13 నెలల్లో యానిక్ సిన్నర్ తన మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీనికి ముందు, అతను యూఎస్ ఓపెన్ 2024, చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో కూడా గెలిచాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌-2 అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ మరోసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకోలేకపోయాడు.

అలెగ్జాండర్ జ్వెరెవ్ 2015 నుంచి గ్రాండ్ స్లామ్ ఆడుతున్నాడు. ఈ కాలంలో అతను 3 సార్లు ఫైనల్స్‌కు చేరుకోవడంలో విజయం సాధించాడు. అయితే, ప్రతిసారీ ఓటమిని చవిచూడాల్సి వస్తోంది. ఈసారి ఫైనల్ చేరేందుకు జ్వెరెవ్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. సెమీ-ఫైనల్స్‌లో, అతను నోవాక్ జొకోవిచ్ సవాలును ఎదుర్కొన్నాడు. అయితే, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, కాలు గాయం కారణంగా ఒక సెట్ తర్వాత మ్యాచ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఫైనల్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు ఇప్పటివరకు మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు చేరిన సినర్.. మూడుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో సఫలమయ్యాడు.

చరిత్ర సృష్టించిన యానిక్ సినర్..

యానిక్ సినర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో తన టైటిల్‌ను కాపాడుకున్న 11వ ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు, అతను జిమ్ కొరియర్ (1992, 1993) తర్వాత వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా అయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..