Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించనున్న తెలుగు తేజం.. తొలి భారత ప్లేయర్‌గా పీవీ సింధు?
PV Sindhu: గత 17-18 సంవత్సరాలుగా భారతదేశంలో కొత్త, ప్రతిభావంతులైన బ్యాడ్మింటన్ క్రీడాకారులను సిద్ధం చేస్తున్న మాజీ వెటరన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అనేకమంది శిష్యులలో సింధు ఒకరు. సైనా నెహ్వాల్‌లానే సింధు కూడా హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ నేర్చుకుని ఈ గేమ్‌లో మెరుగైంది. జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడిన తల్లిదండ్రుల ముద్దుల కుమార్తె సింధు మాత్రం బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకుంది.
Paris Olympics 2024: పీవీ సింధు. ఈ పేరు, గత దశాబ్దంలో భారతీయ బ్యాడ్మింటన్‌కు అతిపెద్ద గుర్తింపుగా నిలిచింది. సైనా నెహ్వాల్ భారతదేశంలోని బ్యాడ్మింటన్‌కు, ముఖ్యంగా మహిళల సింగిల్స్‌లో తన పేరును శిఖరాలకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దాన్ని సింధు కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. తన పొడవాటి ఎత్తు, ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఎంతో నేర్పరి. సింధు, చాలా సంవత్సరాలుగా ఈ ఈవెంట్‌లో భారతదేశానికి అతిపెద్ద ఆశగా నిలిచింది. ఒలింపిక్స్ లేదా ఆసియా క్రీడలు లేదా ప్రపంచ ఛాంపియన్‌షిప్ అయినా, సింధు భారతదేశానికి బలమైన పోటీదారుగా నిలిచింది. 21 ఏళ్ల వయసులో తొలి ఒలింపిక్స్ ఆడిన సింధు.. హ్యాట్రిక్ పతకాలు సాధించాలనే ఉద్దేశంతో మూడో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనుంది.
గత 17-18 సంవత్సరాలుగా భారతదేశంలో కొత్త, ప్రతిభావంతులైన బ్యాడ్మింటన్ క్రీడాకారులను సిద్ధం చేస్తున్న మాజీ వెటరన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అనేకమంది శిష్యులలో సింధు ఒకరు. సైనా నెహ్వాల్‌లానే సింధు కూడా హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ నేర్చుకుని ఈ గేమ్‌లో మెరుగైంది. జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడిన తల్లిదండ్రుల ముద్దుల కుమార్తె సింధు మాత్రం బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకుంది. తెల్లవారుజామున 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిక్షణా శిబిరానికి వెళ్లినా, లేదా టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు కుటుంబం పూర్తి మద్దతు ఇచ్చింది.
భారతదేశ తొలి ప్రపంచ ఛాంపియన్..
కేవలం 8 సంవత్సరాల వయస్సులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించిన సింధు, 2012 చైనా మాస్టర్స్‌లో మొదటిసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమె లండన్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లి జియెరుయిని ఓడించి ఆశ్చర్యపరిచింది. 2013లో, సింధు ఇటు దేశం, అటు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కేవలం 18 సంవత్సరాల వయస్సులో, ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ పతకం సాధించిన రెండవ భారతీయురాలు, మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఆ తర్వాత, ఆమె మళ్లీ 2 రజతం, 1 కాంస్యం గెలుచుకుంది. చివరకు 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా నిలిచింది.
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశం..
సింధు తన తొలి ఒలింపిక్స్‌లోనే అద్భుతాలు చేసింది. రియో 2016 ఒలింపిక్స్‌లో సింధు సంచలన ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక్కడ స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓడి స్వర్ణాన్ని కోల్పోయింది. కానీ, ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. టోక్యో 2020లో పతకం గెలిచి తిరిగి వచ్చిన సింధు ఒలింపిక్స్‌లో మళ్లీ కనిపించింది. అయితే, ఈసారి కూడా స్వర్ణం రాలేదు. కాంస్య పతకంతో రెండు వేర్వేరు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణి (సుశీల్ కుమార్ తర్వాత – 2008, 2012)గా నిలిచింది. ఇప్పుడు ఆమె పారిస్‌లో 3వ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంటే.. మూడు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన తొలి భారతీయురాలు అవుతుంది.
వీటన్నింటితో పాటు, సింధు కామన్వెల్త్ గేమ్స్‌లో 2 స్వర్ణాలు, సింగిల్స్ (2022), మిక్స్‌డ్ టీమ్ (2018)లో ఒకటి కూడా గెలుచుకుంది. ఈ గేమ్‌లలో ఆమె రెండు రజతం, ఒక కాంస్యం కూడా గెలుపొందింది. ఆసియా క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. సింధు తన పేరు మీద అనేక మాస్టర్స్, సూపర్ సిరీస్‌లను కూడా గెలుచుకుంది. ఆమె BWF ర్యాంకింగ్స్‌లో 2వ స్థానానికి చేరుకుంది.
ఒలింపిక్స్‌లో సింధు మరోసారి భారత ఆశలకు కేంద్రంగా నిలవనుంది. పారిస్ ఒలింపిక్స్ ఆమెకు మరింత ప్రత్యేకం కాబోతోంది. ఎందుకంటే ఆమె తొలిసారిగా ప్రారంభ వేడుకల్లో భారత జట్టు జెండా బేరర్‌గా కనిపించనుంది. గత రెండేళ్లుగా ఆమె బాగా రాణించలేకపోయింది. చాలా పెద్ద టోర్నమెంట్లలో ప్రారంభ రౌండ్లలోనే నిష్క్రమించింది లేదా ఫైనల్స్‌కు దూరమైంది. ఈ కాలంలో ఫిట్‌నెస్ కూడా ఆమెకు మద్దతు ఇవ్వలేదు. మరి ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..