Australian Open 2022: దుమ్మురేపిన స్పెయిన్ బుల్.. రికార్డు సృష్టించిన రాఫెల్ నాదల్..
ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2022)లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్(Rafael Nadal) కొత్త చరిత్రను లిఖించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2022)లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్(Rafael Nadal) కొత్త చరిత్రను లిఖించాడు. జకోవిచ్, రోజర్ ఫెదరర్‌లను దాటుకుని టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రాఫెల్ నాదల్ ఫైనల్ గేమ్‌లో డేనియల్ మెద్వెదేవ్(Daniil Medvedev)ను ఓడించి చారిత్రాత్మక 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
చివరి సెట్‌వరకూ జరిగిన హోరాహోరీ పోరులో మెద్వెదెవ్‌పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫెల్ నాదల్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 21వ గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవడం విశేషం. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్.. ఆఖరి మూడు సెట్లలో అసమాన పోరాటం కనబరిచి విజయం సాధించడంతోపాటు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
Legendary status ?#AusOpen • #AO2022 pic.twitter.com/7uDDds3x7z
— #AusOpen (@AustralianOpen) January 30, 2022
Read Also.. IPL-2022: ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆ ఆటగాళ్లకు డిమాండ్ ఉంటుంది.. ఆ ప్లేయర్స్ ఎవరంటే..