Winter Olympics: నేటి నుంచే వింటర్ ఒలింపిక్స్.. వేడుకలను బహిష్కరించిన భారత్..!
ఈ క్రీడల్లో దాదాపు 91 దేశాల నుంచి 2,871 మంది అథ్లెట్లు(Athletes) తమ సత్తా చూపనున్నారు. మొత్తం 109 విభాగాల్లో వీరు పాల్గొననున్నారు.
వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) నేటి నుంచి మొదలుకానున్నాయి. అయితే నేడు నిర్వహించే వేడుకలకు భారత్ దూరమైంది. టార్చ్ బేరర్‌గా గాల్వాన్ దాడిలో పాల్పడిన సైనికుడిని నియమించడాన్ని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై ఇప్పటికే అమెరికా కూడా చైనాకు అక్షింతలు వేసింది. బీజింగ్(Beijing, China) వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు ఈ వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. కాగా, నేడు బీజింగ్‌లోని జాతీయ స్టేడియంలో ఆటలకు ముందు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో దాదాపు 91 దేశాల నుంచి 2,871 మంది అథ్లెట్లు(Athletes) తమ సత్తా చూపనున్నారు. మొత్తం 109 విభాగాల్లో వీరు పాల్గొననున్నారు.
కాగా, ప్రారంభానికి ఒకరోజు ముందు సిబ్బందిలో చాలామందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో మరిన్ని కఠిన నియమాలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ పోటీలకు విదేశీ ప్రేక్షకులకు అనుమతినివ్వలేదు. అయితే ఇప్పటికే వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా కర్లింగ్, లూజ్, స్కై జంపింగ్, అల్పైన్ స్కీయింగ్, ఫ్రీస్టయిల్ స్కీయింగ్, ఐస్ హాకీ, స్కై జంపింగ్ పోటీలు మొదలయ్యాయి. అయితే రేపటి నుంచి (శనివారం) పతకాల ఈవెంట్లు మొదులుకాబోతున్నాయి.
వింటర్ ఒలింపిక్స్ 2022లో భారత్ తరపున కేవలం ఒకే ఒక్క అథ్లెట్ పోటీపడుతున్నాడు. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్ (Arif Khan) స్కీయింగ్‌లో తన సత్తా చూపనున్నాడు. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ విభాగాల్లో ఈ భారత ఆటగాడు పోటీపడనున్నాడు. ఈ పోటీల్లో 1964 నుంచి భారత్ నుంచి అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. అయితే 2002 తర్వాత భారత్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్ పోటీపడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కాగా, 14 ఏండ్లలో వింటర్ ఒలింపిక్స్ పోటీలకు బీజింగ్ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి మాత్రమే. కాగా, ఈ పోటీలకు సంబంధించిన ప్రారంభ, ముగింపు సంబురాలను భారత్ బహిష్కరించి చైనాకు షాక్ ఇచ్చింది.
Also Read: ICC U 19 World Cup: ఫైనల్లో ఇలా ఆడితే.. విజయం మీ సొంతం: కుర్రాళ్లకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు
PSL 2022: 4 ఓవర్లు, 8 సిక్సులు, 67 పరుగులు.. పాక్ మాజీ బౌలర్‌ను ఉతికారేసిన బ్యాట్స్‌మెన్స్..!