ICC U 19 World Cup: ఫైనల్లో ఇలా ఆడితే.. విజయం మీ సొంతం: కుర్రాళ్లకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు

IND vs ENG: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు, విరాట్ కోహ్లీ టీమిండియాలో ధైర్యం నింపాడు. మాజీ కెప్టెన్ విజయ మంత్రాన్ని అందించాడు. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిన భారత్.. ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ICC U 19 World Cup: ఫైనల్లో ఇలా ఆడితే.. విజయం మీ సొంతం: కుర్రాళ్లకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు
U19 Worldcup Virat Message To Young Players
Follow us
Venkata Chari

|

Updated on: Feb 04, 2022 | 9:33 AM

ICC U19 World Cup 2022: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా(U19 Team India) శనివారం ఇంగ్లండ్‌(IND vs ENG)తో తలపడనుంది. ఫైనల్‌కు ముందు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్లతో వీడియో కాల్‌లో మాట్లాడి, వారికి పలు చిట్కాలు అందించాడు. విరాట్ తన కెప్టెన్సీలో 2008లో భారత జట్టును అండర్-19 ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ(Virat Kohli)తో సంభాషణ వీడియోను అండర్-19 జట్టు సభ్యులు కౌశల్ తాంబే, రవ్‌జర్ధన్ హంగర్గేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

హంగర్గేకర్ తన పోస్ట్‌లో, ‘విరాట్ కోహ్లీ భయ్యాతో చాట్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. తన నుంచి జీవితంతోపాటు క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. ఇది రాబోయే కాలంలో మాకు సహాయపడుతుంది’ అని పేర్కొన్నాడు. అదే సమయంలో, కౌశల్ తాంబే తన పోస్ట్‌లో విరాట్‌ను గొప్ప ఆటగాడిగా అభివర్ణిస్తూ, ‘ఫైనల్‌కు ముందు గొప్ప ఆటగాడి నుంచి విలువైన సూచన’ అంటూ రాసుకొచ్చాడు.

U19 Worldcup

సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5న ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. సెమీ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా నాలుగోసారి, ఓవరాల్‌గా 8వ సారి టైటిల్‌ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కెప్టెన్ యశ్ ధుల్ 110 పరుగులు చేయగా, షేక్ రషీద్ 94 పరుగులు చేశారు.

5వ సారి టైటిల్ అందేనా.. భారత్‌కు 5వ సారి టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. 2000, 2008, 2012, 2018లో భారత్‌ టైటిల్‌ గెలిచి, అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 3 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

Also Read: PSL 2022: 4 ఓవర్లు, 8 సిక్సులు, 67 పరుగులు.. పాక్ మాజీ బౌలర్‌ను ఉతికారేసిన బ్యాట్స్‌మెన్స్..!

IND VS WI: భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్‌పై తర్జనభర్జనలు.. షెడ్యూల్‌ మార్పులపై బీసీసీఐ కీలక ప్రకటన

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ