Friday Fights: ఆస్ట్రేలియాలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్ల మధ్య గొడవ.. షమీ అడ్డుకోకుంటే నానా రచ్చ అయ్యేదే..!

మైదానంలో ఇషాంత్ శర్మ(Ishant Sharma), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆటగాళ్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది.

Friday Fights:  ఆస్ట్రేలియాలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్ల మధ్య గొడవ.. షమీ అడ్డుకోకుంటే నానా రచ్చ అయ్యేదే..!
Friday Fights Indian Cricket Team (1)
Follow us
Venkata Chari

|

Updated on: Feb 04, 2022 | 11:12 AM

Ravindra Jadeja vs Ishant Sharma: క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఆటగాళ్ళు ఉద్వేగంలో స్పృహ కోల్పోయి ఒకరితో ఒకరు ఘర్షణ పడతారు. అయితే మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు పరస్పరం ఘర్షణ పడడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారత జట్టులో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ. టీమ్ ఇండియా(Indian Cricket Team) యూనిట్‌గా రంగంలోకి దిగుతుంది. అయితే టీమిండియాలోని ఇద్దరు పెద్ద ఆటగాళ్లు ఒకరితో ఒకరు ఘర్షణ పడిన సంఘటన గురించి ఈ రోజు తెలుసుకుందాం. మ్యాచ్ కీలక తరుణంలో ఆ జట్టు ఆటగాళ్లు ఒకరికొకరు తిట్టుకోవడం కనిపించింది. ఈ ఆటగాళ్లు మరెవరో కాదు, 2018లో పెర్త్ టెస్టు సందర్భంగా ఇషాంత్ శర్మ(Ishant Sharma), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఒకరిపై ఒకరు ఘర్ణప పడ్డారు. ఇద్దరి మధ్య సంభాషణ చాలా తీవ్రంగా మారింది. దీంతో ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో గొడవ ఆగిపోయింది.

ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా మధ్య జరిగిన డిబేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియోను కూడా ఆస్ట్రేలియా ఛానెల్ విడుదల చేసింది. ఆడియో వినగానే ఇషాంత్, జడేజా ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తేలింది. రవీంద్ర జడేజాను కూడా ఇషాంత్ శర్మ దుర్భాషలాడాడు. ఆటగాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు అరుస్తూనే ఉన్నారు. దీంతో ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకున్నారు. లేకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యేది.

పెర్త్‌లో అసలేం జరిగిందంటే? 2018వ సంవత్సరంలో, పెర్త్ టెస్టు నాలుగో రోజున, మహ్మద్ షమీ వేసిన బంతి నాథన్ లియాన్ హెల్మెట్‌కు తగలడంతో, ఆ తర్వాత కొంతసేపు ఆట ఆగిపోయింది. ఆట నిలిచిపోవడంతో రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మల మధ్య వాగ్వాదం జరిగింది. అసలు విషయం ఏంటనేది మొదట జనాలకు తెలియలేదు. కానీ, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల ఆడియోను ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టర్ విడుదల చేయడంతో పరిస్థితి అర్థమైంది.

స్టంప్ మైక్‌లో వాయిస్ ప్రకారం, ఇషాంత్ జడేజాతో హిందీలో మాట్లాడాడు, నీ చేతులు చూపించి నాతో మాట్లాడకు. ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పు అని అన్నాడు. అనంతరం జడేజా మాట్లాడుతూ – ఎందుకు అంతగా మాట్లాడుతున్నావు. ఇషాంత్, నా వైపు వేలు చూపకు, నాపై ఉన్న కోపాన్ని బయట పెట్టుకో, నాకేం ఏం కాదు అని అన్నాడు. దీని తర్వాత ఇషాంత్ జడేజాపై అనుచిత పదాలు ఉపయోగించాడు. దీంతో మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ జోక్యం చేసుకుని ఇద్దరు ఆటగాళ్లను విడదీశారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోతే, ఈ అంశంపై మరిన్ని చర్చలు ప్రారంభమయ్యేవి. కానీ, అలా జరగలేదు. అయితే ఇద్దరు ఆటగాళ్ల మధ్య చిన్నపాటి సంభాషణ జరిగిందని, ఎలాంటి గొడవ జరగలేదని బీసీసీఐ సమాచారం అందించింది. అయితే ఈ పోరాటాన్ని అందరూ మర్చిపోయారు. ఎందుకంటే టీమ్ ఇండియా తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. మొత్తం టీమ్ ఇండియా, భారత అభిమానులు ఈ చేదు సంఘటనను సంబరాలతో మర్చిపోయారు.

Also Read: ICC U 19 World Cup: ఫైనల్లో ఇలా ఆడితే.. విజయం మీ సొంతం: కుర్రాళ్లకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు

PSL 2022: 4 ఓవర్లు, 8 సిక్సులు, 67 పరుగులు.. పాక్ మాజీ బౌలర్‌ను ఉతికారేసిన బ్యాట్స్‌మెన్స్..!