AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Olympics: బీజింగ్ ఒలింపిక్స్‌పై టిబెటన్ల ఆగ్రహం.. ‘నో రైట్స్, నో గేమ్స్’ అంటూ ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు..!

వందలాది మంది టిబెటన్ ప్రవాసులు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను ఖండిస్తూ, తమ ప్రాంతానికి స్వాతంత్య్రాన్ని కోరుతూ న్యూ ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం దగ్గర కవాతు చేస్తున్నారు.

Winter Olympics: బీజింగ్ ఒలింపిక్స్‌పై టిబెటన్ల ఆగ్రహం.. 'నో రైట్స్, నో గేమ్స్' అంటూ ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు..!
Tibetans In India On Beijing Olympics
Venkata Chari
|

Updated on: Feb 04, 2022 | 3:02 PM

Share

Beijing Winter Olympics: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌(Winter Olympic)ను ఖండిస్తూ టిబెటన్ ప్రవాసులు నిరసనలు చేస్తున్నారు. ఈమేరకు తమ ప్రాంతానికి స్వేచ్ఛను ఇవ్వాలంటూ శుక్రవారం భారత రాజధాని న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద ర్యాలీలు నిర్వహించారు. నిరసనకారులు టిబెటన్(Tibetans) జెండాలను ఊపుతూ, “నో రైట్స్, నో గేమ్స్”, “సే నో టు జెనోసైడ్ గేమ్స్” వంటి సందేశాలు ఉన్న ప్లకార్డులను పట్టుకున్నారు. చైనా టిబెట్‌ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. బీజింగ్‌కు వ్యతిరేకంగా నిలబడాలని అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థించారు. “ఒలింపిక్ క్రీడలు ప్రేమ, శాంతి స్ఫూర్తిని సూచిస్తాయి. అయితే ఈసారి వాటిని బీజింగ్(Beijing) నిర్వహిస్తోంది. ఇది వేలాది మంది టిబెటన్ల మరణాలకు, మిలియన్ల మంది ప్రజల మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమైంది” అని నిరసనకారులు పేర్కొంటున్నారు.

ఆందోళనకారులు చైనాకు వ్యతిరేకంగా ఇతర నినాదాలు చేస్తూ చైనా జెండాలను దహనం చేశారు. భద్రతా బారికేడ్లను దూకి చైనీస్ ఎంబసీ వైపు పరుగెత్తడానికి ప్రయత్నించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1959లో విఫలమైన తిరుగుబాటు తర్వాత ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా టిబెట్ నుంచి పారిపోయినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో టిబెటన్లు భారతదేశంలో ప్రవాసులుగా నివసిస్తున్నారు. భారతదేశంలో ప్రవాసంలో ఉన్న టిబెటన్ ప్రభుత్వాన్ని చైనా గుర్తించలేదు. ఇప్పటికీ దలైలామాపై ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో చైనా నుంచి టిబెట్‌ను వేరు చేయాలని కోరుతున్నారు.

చైనా మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించింది. వాటిని “శతాబ్దపు అబద్ధం” అంటూ తమదైన ధోరణిలో కొట్టిపారేసింది. ఇంతలో, రెండు సంవత్సరాల క్రితం దేశాల మధ్య జరిగిన ఘోరమైన సరిహద్దు ఘర్షణలో గాయపడిన చైనా సైనికుడికి ఒలింపిక్ టార్చ్ బేరర్‌గా గౌరవం అందించి మరో వివాదానికి దారి తీసింది. దీంతో బీజింగ్ కేంద్రంగా చైనా రాజకీయాలు చేస్తుందని యూఎస్ ఇప్పటికే పలు విమర్శలు కూడా చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్నన బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ వేడుకలను భారత్ బహిష్కరించింది. ఈమేరకు భారత్ తన అగ్ర దౌత్యవేత్తను వింటర్ ఒలింపిక్స్‌కు పంపడం లేదు.

Also Read: Pakistan pacer: పాకిస్తాన్ యువ పేసర్‌పై సస్పెన్షన్ వేటు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా..

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ విజయం సాధించారా.. ఆ విషయం మచ్చగా మిగలనుందా..