Pakistan pacer: పాకిస్తాన్ యువ పేసర్‌పై సస్పెన్షన్ వేటు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా..
ఓ పేసర్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అతనిని బౌలింగ్ నుంచి సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (pcb) శుక్రవారం తెలిపింది...
పాక్ పేసర్ మహ్మద్ హస్నైన్((Mohammad Hasnain)) బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అతనిని బౌలింగ్ నుంచి సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (pcb) శుక్రవారం తెలిపింది. ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన బిగ్ బాష్ లీగ్(Bigbash)లో హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను అంపైర్లు నివేదించారు. “మొహమ్మద్ హస్నైన్ తన బౌలింగ్ యాక్షన్‌ను క్లియర్ చేసే వరకు, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేశారు. అతను 145 కిమీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగలడని, అతను బౌలింగ్ యాక్షన్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపింది. PCB తన సొంత బౌలింగ్ నిపుణుల నివేదిక సస్పెన్ష్ నిర్ణయం తీసుకుంది. అతను తన బౌలింగ్ యాక్షన్‌ను సవరించడానికి PCB-నియమించిన బౌలింగ్ కన్సల్టెంట్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
21 ఏళ్ల హస్నైన్ లాహోర్‌లోని ICC గుర్తింపు పొందిన బయోమెకానిక్స్ ల్యాబొరేటరీలో సిడ్నీ థండర్‌తో ఐదు-గేమ్ స్టింట్‌ను పూర్తి చేసిన తర్వాత పరీక్ష చేయించుకున్నాడు. ఒకప్పుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో 155kph డెలివరీ చేసిన హస్నైన్, 2019లో పాకిస్తాన్‌లో అరంగేట్రం చేసిన తర్వాత ఎనిమిది ODIలు, 18 T20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు. ఇంగ్లీష్ పేసర్ సాకిబ్ మహమూద్‌కు బదులుగా వచ్చిన అతను బలమైన ప్రభావాన్ని చూపాడు. BBLలో అతని తొలి సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి15.71 సగటుతో ఓవర్‌కు 6.00 ఎకానమీతో ఏడు వికెట్లు తీశాడు. హస్నైన్ తన బౌలింగ్ యాక్షన్‌పై జనవరి 19న ఆస్ట్రేలియాలో పరీక్ష చేయించుకున్నాడు.
Read Also.. Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ విజయం సాధించారా.. ఆ విషయం మచ్చగా మిగలనుందా..