ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ జకోవిచ్ కైవసం.. 19వ గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడిన సెర్బియా స్టార్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నొవాక్ జకోవిచ్ నిలిచాడు. తుది పోరులో సిట్సిపాస్‌పై 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయంసాధించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా...
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నొవాక్ జకోవిచ్ నిలిచాడు. తుది పోరులో సిట్సిపాస్‌పై 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయంసాధించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం సెర్బియా స్టార్‌నే వరించింది. తొలి రెండుసెట్లను గెలిచి కెరీర్‌లో మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుందామనుకున్న ఐదో సీడ్ సిట్సిపాస్ ఆశలను వమ్ము చేస్తూ వరుస సెట్లలో జకోవిచ్ చెలరేగిపోయాడు. దీంతో కెరీర్‌లో రెండో ఫ్రెంచ్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు. మొత్తంగా 19వ గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడాడు.
మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రెజికోవా – సినియాకోవా జోడీ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో క్రెజికోవా – సినియాకోవా జంట 6-4, 6-2 తేడాతో స్వైతెక్ – సాండ్స్‌పై గెలుపొందారు. నిన్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను క్రెజికోవా గెలుచుకున్న విషయం తెలిసిందే. సింగిల్స్ విజేత డబుల్స్‌లోనూ గెలవడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం!