AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్​సీసీ అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం పొడిగింపు..

ప్రతిష్ఠాత్మక మెరిల్​బోన్ క్రికెట్​ క్లబ్​(ఎమ్​సీసీ) ప్రెసిడెంట్ గా కుమార సంగక్కర పదవీకాలం, మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సదరు క్లబ్ ప్రకటన విడుద‌ల చేసింది. దీంతో రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర. ఈ మేరకు అతడి పదవీకాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పెంచాలని డెషిస‌న్ తీసుకున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. దీంతో రెండేళ్లు పదవిలో ఉండనున్న నాలుగో వ్యక్తిగా సంగక్కర నిలవనున్నాడు. గతేడాది అక్టోబరులో ఎమ్​సీసీ […]

ఎమ్​సీసీ అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం పొడిగింపు..
Ram Naramaneni
|

Updated on: May 06, 2020 | 10:35 PM

Share

ప్రతిష్ఠాత్మక మెరిల్​బోన్ క్రికెట్​ క్లబ్​(ఎమ్​సీసీ) ప్రెసిడెంట్ గా కుమార సంగక్కర పదవీకాలం, మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సదరు క్లబ్ ప్రకటన విడుద‌ల చేసింది. దీంతో రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర. ఈ మేరకు అతడి పదవీకాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పెంచాలని డెషిస‌న్ తీసుకున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. దీంతో రెండేళ్లు పదవిలో ఉండనున్న నాలుగో వ్యక్తిగా సంగక్కర నిలవనున్నాడు. గతేడాది అక్టోబరులో ఎమ్​సీసీ ప్రెసిడెంట్ గా ఎంపికైన సంగక్కర.. ఈ పదవి చేపట్టిన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

“నార్మ‌ల్ గా ఎమ్​సీసీ ప్రెసిడెంట్ పదవీకాలం ఏడాదే ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో దానిని పొడిగించొచ్చు. గతంలో ఇలానే లార్డ్ హావ్​కే(1914-18), స్టాన్లీ క్రిస్టోపెరెన్స్(1939-45) కొనసాగారు” అని ఎమ్​సీసీ పేర్కొంది.