కనీసం నాలుగు వారాల శిక్షణ తప్పనిసరిః రహనే
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రికెట్ టోర్నమెంట్స్ అన్నీ కూడా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మళ్ళీ క్రికెట్ మ్యాచ్ లు మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా ఆటగాళ్లకు నాలుగు వారాల ప్రాక్టీస్ తప్పనిసరి అవసరం అవుతుందని టీం ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహనే అభిప్రాయపడ్డాడు. ఫార్మాట్ ఏదైనా మళ్లీ క్రికెట్ మొదలైన తర్వాత ప్లేయర్స్ కు నెల రోజుల ప్రాక్టీసు అవసరం. ఇక కరోనాకు టీకా వచ్చిన తర్వాతే క్రికెట్ ఆరంభం […]

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రికెట్ టోర్నమెంట్స్ అన్నీ కూడా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మళ్ళీ క్రికెట్ మ్యాచ్ లు మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా ఆటగాళ్లకు నాలుగు వారాల ప్రాక్టీస్ తప్పనిసరి అవసరం అవుతుందని టీం ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహనే అభిప్రాయపడ్డాడు.
ఫార్మాట్ ఏదైనా మళ్లీ క్రికెట్ మొదలైన తర్వాత ప్లేయర్స్ కు నెల రోజుల ప్రాక్టీసు అవసరం. ఇక కరోనాకు టీకా వచ్చిన తర్వాతే క్రికెట్ ఆరంభం కావాలి. కరచాలనాలు, వికెట్ పడ్డాక ప్లేయర్స్ సంబరాలు కూడా ఉండవని అనుకుంటున్నా.. అన్నింటిని నమస్తేలు భర్తీ చేస్తాయని రహనే అన్నాడు. అభిమానుల భద్రత చాలా ముఖ్యమని.. ఆట ఒకసారి మొదలయ్యాక మళ్లీ మంచి రోజులు వస్తాయని రహనే తెలిపాడు.




