AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్లకు బిగ్ షాక్..!

పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో ఇమానే ఖెలిఫ్, లిన్ యు-టింగ్ వంటి ట్రాన్స్‌జెండర్ మహిళా అథ్లెట్ల విజయాలు పెద్ద వివాదానికి దారితీయడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఉన్న టెస్టోస్టెరాన్ స్థాయి పరిమితి నిబంధనలను పక్కన పెట్టి, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ముందు మహిళా క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలపై పూర్తి నిషేధం విధించే అవకాశం ఉంది.

ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్లకు బిగ్ షాక్..!
Ioc Transgender Ban
Krishna S
|

Updated on: Nov 11, 2025 | 12:16 PM

Share

ఒలింపిక్ క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల అర్హతపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన ఇమానే ఖెలిఫ్, చైనీస్ తైపీకి చెందిన లిన్ యు-టింగ్వివాదాస్పదంగా స్వర్ణ పతకాలు గెలుచుకున్న తర్వాత ఈ అంశంపై IOC శాస్త్రీయ దర్యాప్తును ప్రారంభించింది. నివేదికల ప్రకారం.. ఐవోసీ 2028 ఒలింపిక్స్‌కు ముందు మహిళల విభాగంలో ట్రాన్స్‌జెండర్లపై పూర్తి నిషేధం విధించే అవకాశం ఉంది.

వివాదానికి కారణం ఏమిటి..?

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ట్రాన్స్‌జెండర్లు టెస్టోస్టెరాన్ స్థాయిలు పరిమితి కంటే తక్కువగా ఉన్నంత వరకు పోటీ పడవచ్చు. అయితే బాక్సింగ్‌లో ఖెలిఫ్, యు-టింగ్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. వీరిద్దరూ అంతకుముందు 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో లింగ అర్హత పరీక్షల్లో విఫలమైనందుకు అనర్హులు అయినప్పటికీ ఒలింపిక్స్‌లో పోటీ పడి గెలవడంతో ఈ వివాదం చెలరేగింది. కానీ ఇప్పుడు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే వరకు ఖెలిఫ్ మహిళా విభాగంలో పోటీ పడలేరు. అయితే ఇద్దరు అథ్లెట్లు తాము మహిళలమని పదేపదే చెబుతున్నారు.

పూర్తి నిషేధం ఎందుకు?

ఐవోసీ కొత్త అధ్యక్షుడు క్రిస్టీ కోవెంట్రీ, మహిళా క్రీడా విభాగాన్ని రక్షించడానికిఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇది 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ముందు తలెత్తే ఒక పెద్ద సమస్యను కూడా నివారించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌లకు వీసాలు ఇవ్వబోమని ఇప్పటికే చెప్పారు. ఐవోసీ నిషేధం విధిస్తే, అమెరికాతో వచ్చే గొడవలు కూడా తగ్గుతాయి.

ఎప్పటి నుంచి అమల్లోకి..?

ఈ నిషేధాన్ని 2026 వింటర్ ఒలింపిక్స్కు కొద్ది రోజుల ముందు అధికారికంగా ప్రకటించవచ్చు. అయితే, ఈ కొత్త నియమాలు పూర్తిగా అమలులోకి రావడానికి దాదాపు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం పట్టవచ్చని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us