IND vs SA: రేపటి నుంచి విశాఖ టీ 20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

IND vs SA Series: సిరీస్‌లో భాగంగా మూడో టీ-20మ్యాచ్‌ ఈనెల 14న విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ACA) చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇక రేపటి (జూన్‌ 5) నుంచి ఈ మ్యాచ్‌ టికెట్లను అమ్మకానికి ఉంచుతోంది

IND vs SA: రేపటి నుంచి విశాఖ టీ 20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..
Ind Vs Sa
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2022 | 6:00 PM

IND vs SA Series: ఐపీఎల్‌-2022 లీగ్‌ ముగిసింది. దీంతో టీమిండియా క్రికెటర్లు మళ్లీ ఇండియన్‌ జెర్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నారు. జూన్‌ 9 నుంచి ఈ సిరీస్‌ (IND vs SA) ప్రారంభం కానుంది. సిరీస్‌లో భాగంగా మూడో టీ-20మ్యాచ్‌ ఈనెల 14న విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ACA) చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇక రేపటి (జూన్‌ 5) నుంచి ఈ మ్యాచ్‌ టికెట్లను అమ్మకానికి ఉంచుతోంది. ఆదివారం ఉదయం11.30 నుంచి ఆన్‌లైన్లో టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇలా బుక్‌ చేసుకోండి..

27,251 సీటింగ్‌ కెపాసిటీ ఉన్న విశాఖ గ్రౌండ్‌లో కొన్ని టికెట్లను స్థానిక క్రికెట్‌ క్లబ్‌లకు కేటాయించనున్నారు. మిగిలిన టికెట్లను పేటీఎం యాప్‌  ప్లాట్‌ఫాంలో ఉంచనున్నారు. టికెట్‌ కనీస ధర రూ.600 నుంచి రూ.6 వేల వరకు ఉంటుంది. మ్యాచ్‌కు ముందు రోజు అంటే జూన్‌ 8న ఆఫ్‌లైన్‌లో విశాఖలోని 3 కేంద్రాల్లోనూ మ్యాచ్‌ టికెట్లు విక్రయించనున్నారు. కాగా విశాఖతో పాటు విజయవాడ, హైదరాబాద్‌ల నుంచి టికెట్లను బుక్‌ చేసుకున్న వారికి కొరియర్‌ సర్వీసుల ద్వారా టికెట్లను పంపనున్నారు.

ఇవి కూడా చదవండి

Also Read:

 Vikram Movie Collections: బాక్సాఫీస్‌పై దండెత్తిన విక్రమ్‌.. మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే..

Imran Khan: పాక్‌లో ఇమ్రాన్‌ మద్దతుదారుల అరాచకం.. చుస్తే అవ్వా అనాల్సిందే..! వీడియోలు వైరల్‌

Andhra Pradesh: మిస్టరీగా గ్యాస్ లీకేజీ ఘటన.. కంపెనీ మూసివేత.. వాస్తవాల అధ్యయానికి నిపుణుల కమిటీ