హమ్మయ్య.. క్రికెటర్‌కు కరోనా లేదు..!

క్రికెటర్ లూకీ ఫెర్గ్యూసన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో వణికిపోయిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. లూకీకి పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో జట్టుకు ఉపశమనం లభించినట్లైంది.

  • Tv9 Telugu
  • Publish Date - 7:04 pm, Sat, 14 March 20
హమ్మయ్య.. క్రికెటర్‌కు కరోనా లేదు..!

క్రికెటర్ లూకీ ఫెర్గ్యూసన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో వణికిపోయిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. లూకీకి పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో జట్టుకు ఉపశమనం లభించినట్లైంది. కాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే తర్వాత ఫెర్గ్యూసన్‌ గొంతు నొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానాలు వచ్చాయి. దీంతో ఆయనను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. ఇక లూకీ నమూనాలను పరీక్షల నిమిత్తం పంపగా.. అందులో నెగిటివ్‌గా తేలింది. దీంతో అతను యథావిధిగా జట్టుతో కలవనున్నారు. ఇదిలా ఉంటే అంతకుముందు ఆసీస్‌ క్రికెటర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌కు సైతం కరోనా భయంతో ప్రత్యేక చికిత్స అందించారు. ఆయనకు జరిపిన పరీక్షల్లో సైతం ‘నెగెటివ్‌’ వచ్చింది. ఇదిలా ఉంటే కరోనా ప్రభావంతో ఈ నెలలో జరగాల్సిన ఐపీఎల్‌ను సైతం బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఇట్స్ ‘కరోనా’ టైమ్.. బన్నీ టీమ్‌కు షాక్..!