ఐపీఎల్‌ 2020: ఏప్రిల్‌ 20 తుది గడువు.. అలాకాకుంటే..?

చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్‌ ముప్పుతో మార్చి 29న ఆరంభమవ్వాల్సిన ఐపీఎల్ 2020 టోర్నీని ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించక

ఐపీఎల్‌ 2020: ఏప్రిల్‌ 20 తుది గడువు.. అలాకాకుంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 14, 2020 | 4:25 PM

చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్‌ ముప్పుతో మార్చి 29న ఆరంభమవ్వాల్సిన ఐపీఎల్ 2020 టోర్నీని ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించక ఏప్రిల్‌ 20న గనక సీజన్‌ మొదలవ్వకపోతే ఈ ఏడాది ఐపీఎల్‌ వేడుక లేనట్టేనని తాజా సమాచారం.

కోవిద్ 19 వైరస్ ప్రభావంతో పెద్ద పెద్ద ఈవెంట్స్ రద్దు అవుతున్నాయి. కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దౌత్య, ఉద్యోగ మినహా అన్ని విభాగాల వీసాలను ఏప్రిల్‌ 15 వరకు రద్దు చేసింది. విదేశీ ఆటగాళ్లంతా వాణిజ్య వీసాల విభాగంలో రావడంతో వారికి అప్పటి వరకు ప్రవేశం లేదు. కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రజలు ఒకే చోట గుమిగూడకుండా చూడాలని బీసీసీఐ సహా క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేశారు.

భారత్ లోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే కరోనా కట్టడి దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా విస్తృతి ఏప్రిల్‌లో ఎలా ఉంటుందో తెలియని నేపథ్యంలో ఐపీఎల్‌ రద్దు దిశగా సాగే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్‌ 20న ఐపీఎల్‌ ఆరంభమవుతుంది. ఐతే ఆ నిర్ణయం ఏప్రిల్‌ 10నే తీసుకోవాలి. ఏప్రిల్‌ 20 లోపు టోర్నీ మొదలవ్వకపోతే వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టే’ అని ఐపీఎల్‌ అధికారి ఒకరు తెలిపారు.

అయితే.. ఐపీఎల్ మొదలు పెట్టాలనుకున్నా ఫ్రాంచైజీలు ఖాళీ స్టేడియాల్లో ఆటకైనా అంగీకరిస్తున్నాయేమో కానీ విదేశీ ఆటగాళ్లు లేకుండా మాత్రం అస్సలు వద్దంటున్నాయని సమాచారం. ఎందుకంటే ఎక్కువ ఫ్రాంచైజీలు విదేశీ స్టార్లపైనే ఆధారపడుతున్నాయి. కోచింగ్‌, సాంకేతిక సిబ్బందిలోనూ వారే ఉన్నారు. అందుకే విదేశీయులు లేకుంటే ఐపీఎల్‌ కష్టం. వైరస్‌ వ్యాప్తి తగ్గకపోతే వీసాలపై ఆంక్షలు పొడగిస్తారే కానీ సడలించరన్నది తెలిసిందే.

Rad Also: లండన్‌లో.. అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు కరోనా..!