Breaking: కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..
Corona Effect: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాల క్రీడారంగాలపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఈ కోవిడ్ 19 వల్ల ఇప్పటికే చాలా టోర్నమెంట్లు రద్దు కావడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. కివీస్ జట్టు పేస్ బౌలర్ లూకి ఫెర్గుసన్ తనకు గొంతు నొప్పి, జలుబు ఉందని యాజమాన్యానికి తెలపడంతో అతడిని వెంటనే ఐసోలేషన్‌కు […]
Corona Effect: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాల క్రీడారంగాలపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఈ కోవిడ్ 19 వల్ల ఇప్పటికే చాలా టోర్నమెంట్లు రద్దు కావడమే కాకుండా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది.
కివీస్ జట్టు పేస్ బౌలర్ లూకి ఫెర్గుసన్ తనకు గొంతు నొప్పి, జలుబు ఉందని యాజమాన్యానికి తెలపడంతో అతడిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ఈ విషయాన్ని జట్టు అధికారి ఒకరు వెల్లడించారు. నిన్న జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై 71 పరుగుల తేడాతో కివీస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ తర్వాత పైవిధంగా తనకు లక్షణాలు ఉన్నట్లు ఫెర్గుసన్ చెప్పడంతో అతడ్ని ఐసోలేషన్‌కు తరలించి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఒకసారి టెస్టులు పూర్తి అయ్యి.. ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చాక టీమ్‌తో కలుస్తాడని ప్రకటించారు.
అటు ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్‌సన్‌కు కూడా హెల్త్ బాగోలేదని తెలపగా.. యాజమాన్యం తొలి వన్డే ముందు కరోనా టెస్టులు జరిపారు. ఇక అతని రిపోర్ట్స్ నెగటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
For More News:
గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్
ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..
దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!
జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..
వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…
కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..
గుడ్ న్యూస్.. కరోనాకు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..