కోవిడ్-19 భయం.. బెంగుళూరులో ఇన్ఫోసిస్ ఆఫీసు ఖాళీ
బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలియడంతో ఈ సంస్థ కార్యాలయాల్లో ఒకదానిని ఖాళీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా తాము ఐఐపీఎం బిల్డింగ్ ని మాత్రమే ఖాళీ చేస్తున్నామని
బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలియడంతో ఈ సంస్థ కార్యాలయాల్లో ఒకదానిని ఖాళీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా తాము ఐఐపీఎం బిల్డింగ్ ని మాత్రమే ఖాళీ చేస్తున్నామని ఇన్ఫోసిస్ బెంగుళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండే ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. 1990 నుంచి ఈ నగరంలో డజనుకు పైగా ఇన్ఫోసిస్ కార్యాలయాలు ఉన్నాయి. కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే ఈ భవనాన్ని ఖాళీ చేస్తున్నామని, తమ రక్షణకోసం ఈ బిల్డింగ్ లో శుభ్రతా చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. ఇక అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని ఆయన ఉద్యోగులను కోరారు. సోషల్ మీడియా ద్వారా వచ్ఛే తప్పుడు సమాచారాన్ని, వదంతులను నమ్మవద్దని సిబ్బందిని అభ్యర్థిస్తున్నామన్నారు. ఎమర్జన్సీ అనిపించినప్పుడు ఉద్యోగులు కంపెనీ గ్లోబల్ హెల్ప్ డెస్క్ నెంబర్లను సంప్రదించాలని పాండే సలహా ఇచ్చారు.
కోవిడ్-19 ఔట్ బ్రేక్ ని నివారించేందుకు ఐటీ, బయోటెక్ సంస్థలన్నీ తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేసేలా చూడాలని కర్ణాటక ప్రభుత్వం సలహా ఇఛ్చిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.