“రేవంత్ చిల్లరి పని చేశాడు”..కోమటిరెడ్డి ఫైర్

ఎంపీ రేవంత్ రెడ్డి బిహేవియర్‌పై సొంత పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఎంపీ స్థాయికి తగ్గట్టుగా కాస్త మెచ్యూర్డ్ పొలిటిషియన్‌గా బిహేవ్ చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌కు సూచించారు. డ్రోన్ కెమెరా పెట్టి ఫామ్‌హౌజ్ చిత్రాలు తియ్యడం చిల్లర పనికాక మరేంటన్నారు. రేవంత్ రెడ్డి ఓ హీరోలా తనకు తానే ఫీల్ అవుతున్నారని..కారెక్కి షో చేయడం పిల్లతనంలా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. గోపన్‌పల్లి భూముల గోల్‌మాల్  బయటపడగానే  ఆయనకు 111 జీవో గుర్తొచ్చిందా అంటూ […]

రేవంత్ చిల్లరి పని చేశాడు..కోమటిరెడ్డి ఫైర్
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 14, 2020 | 5:34 PM

ఎంపీ రేవంత్ రెడ్డి బిహేవియర్‌పై సొంత పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఎంపీ స్థాయికి తగ్గట్టుగా కాస్త మెచ్యూర్డ్ పొలిటిషియన్‌గా బిహేవ్ చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌కు సూచించారు. డ్రోన్ కెమెరా పెట్టి ఫామ్‌హౌజ్ చిత్రాలు తియ్యడం చిల్లర పనికాక మరేంటన్నారు. రేవంత్ రెడ్డి ఓ హీరోలా తనకు తానే ఫీల్ అవుతున్నారని..కారెక్కి షో చేయడం పిల్లతనంలా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

గోపన్‌పల్లి భూముల గోల్‌మాల్  బయటపడగానే  ఆయనకు 111 జీవో గుర్తొచ్చిందా అంటూ రేవంత్‌ను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు రాజగోపాల్‌రెడ్డి. ఆ ప్రాంతంలో ఎప్పట్నుంచో నిర్మాణాలు ఉన్నాయని, అలాంటివి ఫోకస్ చెయ్యడం వల్ల పార్టీకి డ్యామేజ్ తప్ప మరో ఉపయోగం లేదన్నారు.  ‘చలో ప్రగతిభవన్‌’ కార్యక్రమానికి వెళ్లినప్పుడు సైతం రేవంత్‌రెడ్డి టీషర్ట్‌ వేసుకొని చిల్లరగా బిహేవ్ చేశాడని పేర్కొన్నారు.