AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: డేంజర్ జోన్‌లో ఆ ఏడు దేశాలు.. అందుకే వారినక్కడికి తరలిస్తున్నారు

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో ఏడు దేశాలను హై రిస్క్ వున్న డేంజర్ కంట్రీస్‌గా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఆ దేశాల నుంచి వస్తున్న వారిని స్వదేశీయులు, విదేశీయులు అనే తేడా లేకుండా ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసిన వికారాబాద్‌కు తరలిస్తోంది సర్కార్.

Breaking: డేంజర్ జోన్‌లో ఆ ఏడు దేశాలు.. అందుకే వారినక్కడికి తరలిస్తున్నారు
Rajesh Sharma
|

Updated on: Mar 14, 2020 | 1:06 PM

Share

Indian govt identified seven countries are in danger zone: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో ఏడు దేశాలను హై రిస్క్ వున్న డేంజర్ కంట్రీస్‌గా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఆ దేశాల నుంచి వస్తున్న వారిని స్వదేశీయులు, విదేశీయులు అనే తేడా లేకుండా ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసిన వికారాబాద్‌కు తరలిస్తోంది సర్కార్. అక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు జరిపిన తర్వాతనే వారిని నగరంలోనికి ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారు.

కరోనా వైరస్ బారిన పడి తొలి మరణాన్ని నమోదు చేసుకున్న తెలంగాణలో దాదాపు హై అలర్ట్ ప్రకటించారు. దుబాయ్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు వచ్చి.. చికిత్స తర్వాత సొంత ప్రదేశమైన కల్బురిగికి వెళ్ళి చనిపోయిన వృద్దుని ఉదంతం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. దానికి తోడు కేంద్రం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు రావడంతో మరిన్ని ఖచ్చితమైన చర్యలను తీసుకునేందుకు సిద్దమైంది.

ఈ క్రమంలోనే విపరీతమైన రద్దీగా మారిన శంషాబాద్ విమానాశ్రాయానికి వస్తున్న విదేశీ ప్రయాణీకులను నేరుగా వికారాబాద్ సమీపంలో నెలకొల్పిన కరొనా స్పెషల్ ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. ముఖ్యంగా హైరిస్క్‌ జోన్‌‌లో వున్న ఏడు దేశాలు.. చైనా, ఇటలీ, ఇరాన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, దక్షిణ కొరియా దేశాలను నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా వుండాలని కేంద్రం రాష్ట్రాలను మరీ ముఖ్యంగా పెద్ద విమానాశ్రాయాలున్న నగర పాలక సంస్థలను హెచ్చరించింది. ఈ క్రమంలో హై రిస్క్‌ జోన్‌లో వున్న ఈ ఏడు దేశాల నుంచి వచ్చే వారిని నేరుగా వికారాబాద్‌లోని కరోనా ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తోంది తెలంగాణ సర్కార్.

వికారాబాద్ కేంద్రంలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగెటివ్ అని తేలితేనే వారిని నగరంలోకి అనుమతించాలని నిర్ణయించింది తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ. ఈ ఏడు దేశాల నుంచి వస్తున్న వారిని కనీసం 14 రోజుల పాటు ఆబ్జర్వేషన్‌లో పెడుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక తనిఖీలు జరుపుతున్నారు. ఈ ఏడు దేశాలతోపాటు మిగిలిన విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులలో కూడా దగ్గు, జలుబు వున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి, వారిని కూడా వికారాబాద్‌కు తరలిస్తున్నారు. వికారాబాద్ దగ్గరలోని అనంతగిరి హరిత వ్యాలీ రిసార్ట్స్‌లో కరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయగా.. అక్కడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు శనివారం పర్యటించారు.