Breaking: సౌతాఫ్రికాతో వన్డేలు రద్దు.. ఎందుకంటే?

క్రికెట్ ప్రియులకు ఇది దుర్వార్త. విదేశాల్లో పరాజయాలతో తిరిగొచ్చిన టీమిండియా స్వదేశంలో సత్తా చాటుతుందని భావించిన క్రికెట్ లవర్స్‌కు నిరాశ కలిగించే వార్త. క్రికెట్‌కు కూడా కరోనా సోకింది. భారత పర్యటనకు వచ్చిన వన్డే సిరీస్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు వన్డేలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

Breaking: సౌతాఫ్రికాతో వన్డేలు రద్దు.. ఎందుకంటే?
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 13, 2020 | 6:09 PM

BCCI called off remaining two ODIs against South Africa: క్రికెట్ ప్రియులకు ఇది దుర్వార్త. విదేశాల్లో పరాజయాలతో తిరిగొచ్చిన టీమిండియా స్వదేశంలో సత్తా చాటుతుందని భావించిన క్రికెట్ లవర్స్‌కు నిరాశ కలిగించే వార్త. క్రికెట్‌కు కూడా కరోనా సోకింది. భారత పర్యటనకు వచ్చిన వన్డే సిరీస్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు వన్డేలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

న్యూజీలాండ్‌లో దారుణ పరాజయం పాలై తిరిగొచ్చిన టీమిండియాలో స్వదేశంలో సౌతాఫ్రికాను ఎదుర్కొనేందుకు సిద్దమైనా.. అందుకు కరోనా గండి కొట్టేసింది. దేశంలో కరోనా వ్యాప్తిపై భయాందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మిగిలిన రెండు వన్డేలను బీసీసీఐ రద్దు చేసేసింది. రెండు జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే.. వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

రెండో వన్డే లక్నోలోను, మూడో వన్డే కోల్‌కతాలోను జరగాల్సి వుండింది. అయితే.. విజృంభిస్తున్న కరోనా మరింత దారుణమైన ప్రభావాన్ని చూపే పరిస్థితి కనిపించడంతో తగిన నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ ఛైర్మెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో బీసీసీఐ కీలక భేటీ ఇవాళ జరిగింది. ఐపీఎల్ టోర్నీతోపాటు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కొనసాగింపుపై బీసీసీఐ చర్చించింది. ప్రేక్షకులను అనుమతించకుండా స్టేడియంలో ఆటను కొనసాగించాలని కొందరు సూచించినా.. అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వన్డేలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.