Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

Allu Arjun: ఇట్స్ ‘కరోనా’ టైమ్.. బన్నీ టీమ్‌కు షాక్..!

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతోంది. ఈ మహమ్మారి వలన అగ్రదేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోతున్నాయి. దీనిపై యుద్ధం చేసేందుకు అన్ని దేశాలు నడుం బిగించినప్పటికీ.. వైరస్‌కు మాత్రం ఇంకా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
shock to Allu Arjun team, Allu Arjun: ఇట్స్ ‘కరోనా’ టైమ్.. బన్నీ టీమ్‌కు షాక్..!

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతోంది. ఈ మహమ్మారి వలన అగ్రదేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలిపోతున్నాయి. దీనిపై యుద్ధం చేసేందుకు అన్ని దేశాలు నడుం బిగించినప్పటికీ.. వైరస్‌కు మాత్రం ఇంకా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా ఈ వ్యాధికి మందును కనుగొనడంలో తలమునకలై ఉన్నారు. కాగా ఈ వ్యాధి ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై కూడా బాగా ప్రభావాన్ని చూపుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో సినిమాల షూటింగ్‌లను, విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్‌లోనూ ఇప్పటికే పలువురు హీరోలు కరోనా ప్రభావంతో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బన్నీ మూవీ చిత్రీకరణకు ఇప్పుడు బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 20వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్‌ను ఎక్కువ భాగం అడవుల్లోనే చేయాల్సి ఉంది. ఈ క్రమంలో శేషాచలం అడవుల్లో చిత్రీకరణ కోసం ఏపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది సుకుమార్ టీమ్. కానీ కొన్ని కారణాల వలన ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్‌కు వెళ్లాలని ఈ చిత్ర యూనిట్ భావించింది. అయితే అక్కడ కరోనా రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు దర్శకుడు. ఇక ఇదంతా కాదని కేరళలోని అడవుల్లో షూటింగ్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీలు చేసుకున్నారట. కానీ కేరళలో కూడా కరోనా వలన షూటింగ్‌లకు అనుమతిని నిరాకరించడంతో ఇప్పుడు బన్నీ టీమ్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. కొద్ది రోజలు బ్రేక్ తీసుకొని.. ఆ తరువాతే షూటింగ్‌ను ప్రారంభించాలని బన్నీ, సుకుమార్ ఇద్దరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నిర్ణయానికి మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఓకే చెప్పినట్లు టాక్.

కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. విజయ్ సేతుపతి పోలీస్ పాత్రలో, రష్మిక మందన్న పల్లెటూరి యువతిగా నటించబోతున్నట్లు టాక్. అలాగే జగపతి బాబు, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Read This Story Also: Prabhas 20: ప్రభాస్ మూవీకి సంగీత దర్శకుడు ఫిక్స్..!

Related Tags