ఆ ఒక్క ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు

విశాఖ: ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది. రెండు టీ20ల్లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మొదట భారత్ ఓడిపోతుందనే అనుకున్నారు అంతా. కానీ భారత బౌలర్ల సత్తా చూసి టీమిండియాదే మ్యాచ్ అనే భావనకు వచ్చేశారు. ముఖ్యంగా భారత అద్భుతమైన బౌలర్ జాస్ప్రిత్ బూమ్ర వేసిన 19వ ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. విశాఖ తీరాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు […]

ఆ ఒక్క ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 7:55 PM

విశాఖ: ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది. రెండు టీ20ల్లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మొదట భారత్ ఓడిపోతుందనే అనుకున్నారు అంతా. కానీ భారత బౌలర్ల సత్తా చూసి టీమిండియాదే మ్యాచ్ అనే భావనకు వచ్చేశారు. ముఖ్యంగా భారత అద్భుతమైన బౌలర్ జాస్ప్రిత్ బూమ్ర వేసిన 19వ ఓవర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

విశాఖ తీరాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు దించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు కోహ్లీ సేన 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఆసిస్ స్కోర్ 111/5. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా రెండు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో 19వ ఓవర్ వేసిన బూమ్రా రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

అంతే భారత్‌కు ఒక్కసారిగా పూర్తి ఆత్మ విశ్వాసం వచ్చింది. ఇక చివరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సి ఉండగా అది చాలా కష్టమనే అంతా భావించారు. ఉమేశ్ యావ్ వేసిన ఆ ఓవర్‌లో ఆసిస్ బ్యాట్స్‌మెన్ చివరి బంతికి 2 పరుగులు చేసి 14 పరుగులు రాబట్టేశారు. దీంతో భారత్ మ్యాచ్ ఓడిపోయింది. అయితే 19వ ఓవర్ వేసిన బూమ్రా గురించి మాత్రం అంతా మాట్లాడుకుంటున్నారు.

పలువురు క్రికెట్ విశ్లేషకులు బూమ్రాను ఆకాశానికెత్తేస్తున్నారు. బూమ్రా ఎందుకు వరల్డ్ క్లాస్ క్రీడాకరుడనేది మరోసారి నిరూపించాడని అంటున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!