టీ20ల్లో అద్భుతం చేసిన రషీద్ ఖాన్

టీ20ల్లో అద్భుతం చేసిన రషీద్ ఖాన్

డెహ్రాడూన్: ఆఫ్గనిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చెలరేగి ఆడాడు. ఐపిఎల్ ద్వారా రాటుదేలిన రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలాన్ని ఐర్లాండ్‌పై చూపిస్తూ ప్రత్యార్ధి బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనీయకుండా చేశాడు. అతని ప్రభావం కారణంగా ఐర్లాండ్‌ను ఆఫ్గనిస్థాన్ జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా జరిగిన మూడో టీట్వంటీలో రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు […]

Vijay K

| Edited By: Srinu Perla

Mar 06, 2019 | 7:56 PM

డెహ్రాడూన్: ఆఫ్గనిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చెలరేగి ఆడాడు. ఐపిఎల్ ద్వారా రాటుదేలిన రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలాన్ని ఐర్లాండ్‌పై చూపిస్తూ ప్రత్యార్ధి బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనీయకుండా చేశాడు. అతని ప్రభావం కారణంగా ఐర్లాండ్‌ను ఆఫ్గనిస్థాన్ జట్టు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా జరిగిన మూడో టీట్వంటీలో రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.

వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన 8వ బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. అయితే అంతకుముందు వరకూ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన వారంతా పేస్ బౌలర్లు మాత్రమే. కానీ రషీద్ ఖాన్ రూపంలో తొలిసారిగా ఒక స్పిన్నర్ టీ20లో హ్యాట్రిక్ సాధించాడు.

హ్యాట్రిక్ కూడా కాదు హ్యాట్రిక్ ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు కాబట్టి. అంతుకు ముందు టీ20 హ్యాట్రిక్ సాధించిన ఆటగాళ్లు వరుసగా బ్రెట్‌లీ, జాకబ్ ఓరమ్, టిమ్ సౌథీ, తిషార పెరార, ఫహీమ్ ఆష్రఫ్, లసిత్ మలింగ.. వీళ్లు మాత్రమే హ్యాట్రిక్‌లు సాధించారు. వీళ్లంతా ఫాస్ట్ బౌలర్లే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu