T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. లిస్టులో ఎవరూ ఊహించని టీమ్
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 2 నుంచి మొదలు కానున్న ఈ టోర్నీ కోసం చాలా జట్లు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన తమ సైన్యాన్ని ప్రకటించాయి. ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 2 నుంచి మొదలు కానున్న ఈ టోర్నీ కోసం చాలా జట్లు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన తమ సైన్యాన్ని ప్రకటించాయి. ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ పై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సారి ఆ జట్టే చాలా బలంగా ఉందంటూ, ప్రపంచకప్ కొడుతుందంటూ, టాప్-4 టీమ్స్ ఇవేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఈ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు వెళ్లే 4 జట్లను పేర్కొన్నాడు. ఆ నాలుగు జట్లేంటో తెలుసుకుందాం రండి.
భారత్
యువరాజ్ సింగ్ అంచనాల ప్రకారం గత టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ లో వెనుదిరిగిన టీమిండియా ఈసారి కూడా నాకౌట్‌కు చేరుకుంటుంది. టైటిల్ గెలిచే ఫేవరెట్ జట్లలో టీమిండియా కూడా ఒకటని యూవీ అభిప్రాయపడ్డాడు.
Yuvraj Singh predicts Top 4 Semifinalists in this T20 World Cup 2024: (ICC).
– India. – Australia. – England. – Pakistan.#T20WorldCup2024 #ViratKohli𓃵 #RohitSharma𓃵 pic.twitter.com/7DN2xn4E9P
— Vikram ßishnoi (@gaming_vic26620) May 2, 2024
ఇంగ్లండ్
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఈసారి కూడా సెమీ ఫైనల్ ఆడనుంది. అద్భుతమైన జట్టు ఉన్న జోస్ బట్లర్ బృందం నుంచి ఈసారి మరింత మంచి ప్రదర్శనను ఆశించవచ్చని యువీ పేర్కొన్నాడు.
పాకిస్తాన్
గత టీ20 ప్రపంచకప్ రన్నరప్ జట్టు పాకిస్థాన్ జట్టు కూడా ఈ నాకౌట్ దశకు చేరుకుంటుంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నందున పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుందని యువీ తెలిపాడు.
ఆస్ట్రేలియా
2021 టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఇప్పుడు పటిష్టంగా ఉందన్నాడు యూవీ. ఈ సారి ప్రపంచకప్ లో ఆసీస్ జట్టు కూడా సెమీఫైనల్‌కు చేరుకుంటుందని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
రిజర్వ్‌లు:
శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..