IPL 2023: ‘రింకూ సింగ్‌’ సిక్సర్ల విధ్వంసం నుంచి కోలుకుని యశ్‌ దయాల్‌.. 10 రోజుల్లో 9 కిలోలు తగ్గిన యంగ్‌ బౌలర్‌

కేకేఆర్‌తో మ్యాచ్‌ తర్వాత యశ్‌ దయాల్‌ ఎక్కడా కనిపించలేదు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్‌లో కూడా దయాళ్ పేరు కనిపించడం లేదు. దీంతో యశ్ ఎలా ఉన్నాడు? ఎక్కడికి వెళ్లాడని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

IPL 2023: 'రింకూ సింగ్‌' సిక్సర్ల విధ్వంసం నుంచి కోలుకుని యశ్‌ దయాల్‌.. 10 రోజుల్లో 9 కిలోలు తగ్గిన యంగ్‌ బౌలర్‌
Yash Dayal
Follow us

|

Updated on: Apr 26, 2023 | 6:06 PM

ఏప్రిల్ 9.. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్‌ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 29 పరుగులు అవసరం కాగా క్రీజులో ఉన్న రింకు సింగ్ చెలరేగిపోయాడు. ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్‌లో 5 బంతుల్లో 5 సిక్సర్లు బాదాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ స్టార్ అయిపోయాడు కానీ యశ్ దయాళ్‌ మాత్రం కుంగిపోయాడు. ఇంకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్న అతనికి ఇలా జరగడం తల్లిదండ్రులు కూడా తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా యశ్‌ తల్లి తన కుమారుడికి జరిగినది అంత త్వరగా మర్చిపోలేక పోయింది. కొన్ని రోజుల పాటు మెతుకు కూడా ముట్టలేదు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌ తర్వాత యశ్‌ దయాల్‌ ఎక్కడా కనిపించలేదు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్‌లో కూడా దయాళ్ పేరు కనిపించడం లేదు. దీంతో యశ్ ఎలా ఉన్నాడు? ఎక్కడికి వెళ్లాడని చాలామంది ప్రశ్నిస్తున్నారు. . యశ్ దయాళ్‌పై గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌ నమ్మకం కోల్పోయిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించాడు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా. ముంబైతో మ్యాచ్‌ గెలిచిన అనంతరం యశ్‌ దయాల్‌ పరిస్థితిపై నోరు విప్పాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌ తర్వాత యశ్‌ అస్వస్థతకు గురయ్యాడని, తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని పాండ్యా తెలిపాడు. అలాగే 7 నుంచి 9 కిలోల బరువు కూడా తగ్గిపోయాడని గుజరాత్‌ సారథి చెప్పుకొచ్చాడు. మొత్తానికి రింకూసింగ్‌ విధ్వంసం సృష్టించిన ఆ ఒక్క ఓవర్ యశ్ దయాల్‌పై బాగా ప్రతికూల ప్రభావం చూపిందని తెలుస్తోంది. ఈ క్రమంలో యశ్ దయాళ్ త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచులు ఆడిన గుజరాత్ టైటాన్స్‌ 5 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..