RCB vs KKR, IPL 2023 Highlights: బెంగళూరుకు షాక్.. కోల్‌కతా ఖాతాలో మూడో విజయం..
Royal Challengers Bangalore vs Kolkata Knight Riders IPL 2023 Highlights in Telugu: రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్ విజయాలే లక్ష్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
Royal Challengers Bangalore vs Kolkata Knight Riders IPL 2023 Highlights in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయం తర్వాత నితీష్ రాణా సారథ్యంలోని కోల్‌కతా ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాలనే ఆశలు పెట్టుకుంది. ఆ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా, బెంగళూరు 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.
ఎం.చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్ విజయాలే లక్ష్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికొన్ని నిమిషాల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా గతంలో కోల్‌కతా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. అయితే వరుసగా 4 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టాలంటే బాగా శ్రమించాల్సిందే.
Fasten your seatbelts, it’s game time! ?#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvKKR pic.twitter.com/EFdhJOGtEC
— Royal Challengers Bangalore (@RCBTweets) April 26, 2023
LIVE Cricket Score & Updates
-
సత్తా చాటిన కోల్‌కతా.. 21 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయం తర్వాత నితీష్ రాణా సారథ్యంలోని కోల్‌కతా ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాలనే ఆశలు పెట్టుకుంది. ఆ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా, బెంగళూరు 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.
ఎం.చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేయగలిగింది.
-
8 వికెట్లు డౌన్..
17.3 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కార్తీక్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బెంగళూరు విజయం సాధించాలంటే 14 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
16 ఓవర్లకు 145 పరుగులు..
16 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కార్తీక్ 15, హసరంగా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. బెంగళూరు విజయం సాధించాలంటే 24 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది.
-
13 ఓవర్లకు 121 పరుగులు..
13 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి, రస్సెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
9 ఓవర్లకు 80 పరుగులు..
9 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు టీం 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.
-
-
కోహ్లీ బౌండరీల వర్షం.. 4 ఓవర్లలోనే 50 దాటిన ఆర్సీబీ స్కోరు..
201 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. ముఖ్యంగా స్టాండింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు విరాట్. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు ఉన్నాయి. డుప్లెసిస్ (17), షాబాజ్ అహ్మద్ (2) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 5 ఓవర్లు ముగిసే సరికి 52/2.
-
జూలు విదిల్చిన కోల్‌కతా బ్యాటర్లు..
కోల్‌కతా జూలు విదిల్చింది. వరుసగా 4 పరాజయాలు ఎదురుకావడంతో నిరాశకు లోనైన ఆ జట్టు ఆటగాళ్లు బుధవారం మాత్రం బెంగళూరుపై విరుచుకుపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (56), కెప్టెన్ నితీశ్ రాణా (48) బెంగళూరు బౌలర్లను చితక బాదారు.
— KolkataKnightRiders (@KKRiders) April 26, 2023
-
కెప్టెన్ రాణా దూకుడు.. 150 పరుగులు దాటిన స్కోరు..
కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా దూకుడుగా ఆడుతున్నాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడుతున్నాడు. 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 42 పరుగులు చేశాడు రాణా. ప్రస్తుతం కోల్ కతా స్కోరు 17 ఓవర్లు ముగిసేసరికి 167/2
-
దంచికొడుతున్న కోల్‌కతా.. రాయ్ అర్ధ సెంచరీ..
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టు ఓపెనర్ జాసన్ రాయ్ కేవలం 24 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. 8 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా స్కోరు 75/0
4️⃣3️⃣, 6️⃣1️⃣, 5️⃣0️⃣*
Once is a chance, twice is a coincidence, thrice is a habit ?#RCBvKKR | #AmiKKR | #TATAIPL | @JasonRoy20 pic.twitter.com/h3y7TVxnDz
— KolkataKnightRiders (@KKRiders) April 26, 2023
-
ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే..
RCB :
విరాట్ కోహ్లి (కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
KKR:
నితీష్ రాణా (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, నారాయణ్ జగదీషన్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, డేవిడ్ వీసా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
-
కోల్‌కతా తరపున వైభవ్ అరంగేట్రం
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రైట్ ఆర్మ్ మీడియం పేసర్ వైభవ్ అరోరా అరంగేట్రం చేశాడు. వైభవ్ గత సీజన్‌లోనే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ తరఫున 5 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు తీశాడు.
-
టాస్ గెలిచిన బెంగళూరు..
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి కోల్‌కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ప్లేయింగ్-XI, ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్టులపై మరికొన్ని క్షణాల్లో క్లారిటీ రానుంది.
-
ప్రతీకారం కోసం బెంగళూరు ఆరాటం..
కాగా ఈ సీజన్‌లో బెంగళూరు, కోల్‌కతా తలపడడం ఇది రెండోసారి. చివరి మ్యాచ్‌లో కోల్‌కతా తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఏకపక్షంగా 81 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ఇప్పుడు స్వదేశంలో కోల్ కతా లెక్క సరిచేయాలని ఆర్సీబీ భావిస్తోంది.
Published On - Apr 26,2023 6:57 PM