RCB vs KKR: బెంగళూరు బౌలర్లను చితక్కొట్టిన రాయ్, రాణా.. కోహ్లీ టీమ్ టార్గెట్ ఎంతంటే?
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ కేవలం 29 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు న్నాయి. రాయ్‌కు తోడు కెప్టెన్ నితీశ్ రాణా (21 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (31), జగదీశన్ (27), రింకూ సింగ్ (18 నాటౌట్) పరుగులు చేయడంతో
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు దంచికొట్టారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ కేవలం 29 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు న్నాయి. రాయ్‌కు తోడు కెప్టెన్ నితీశ్ రాణా (21 బంతుల్లో 48, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (31), జగదీశన్ (27), రింకూ సింగ్ (18 నాటౌట్) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది కోల్‌కతా. బెంగళూరు బౌలర్లలో హసరంగ, విజయ్‌కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. కాగా ఐపీఎల్ 16వ సీజన్‌లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ వరుసగా రెండో అర్థశతకం సాధించాడు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన రాయ్ ఈసారి బెంగళూరు బౌలర్లను టార్గెట్ చేసుకున్నారు. మ్యాచ్‌లో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రాయ్ 22 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షాబాజ్ అహ్మద్‌కు చుక్కలు చూపించాడు రాయ్. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన రాయ్ 24 పరుగులు పిండుకున్నాడు.
Rana Ran Riot – 48(21)
ఇవి కూడా చదవండిEta dekho! ?pic.twitter.com/Lvw8sQdmlh
— KolkataKnightRiders (@KKRiders) April 26, 2023
? evidence of #BengaluruRains tonight ?#RCBvKKR | #AmiKKR | #TATAIPL | @JasonRoy20 pic.twitter.com/RbF8BmddSJ
— KolkataKnightRiders (@KKRiders) April 26, 2023
ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే..
RCB :
విరాట్ కోహ్లి (కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
KKR:
నితీష్ రాణా (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, నారాయణ్ జగదీషన్, జాసన్ రాయ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, డేవిడ్ వీసా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..