AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: ‘టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మత్తు దిగలేదా..’ తిట్టిపోస్తున్న నెటిజన్లు..

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. బంతితో తేలిపోయినా.. బ్యాట్‌తో అయినా మనోళ్లు సత్తా చాటుతారని ఆశిస్తే.. కష్టపడి కొన్ని రన్స్..

WTC Final: 'టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మత్తు దిగలేదా..' తిట్టిపోస్తున్న నెటిజన్లు..
Wtc Final
Ravi Kiran
|

Updated on: Jun 09, 2023 | 10:10 AM

Share

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. తొలి రోజుతో పోలిస్తే.. రెండు రోజు బౌలింగ్ మెరుగైనప్పటికీ.. ఆస్ట్రేలియాను మాత్రం భారీ స్కోర్ చేయకుండా ఆపలేకపోయారు. బంతితో తేలిపోయినా.. బ్యాట్‌తో అయినా మనోళ్లు సత్తా చాటుతారని ఆశిస్తే.. కష్టపడి కొన్ని రన్స్ చేసిన కొద్దిసేపటికే పెవిలియన్ చేరుకున్నారు. ఇలా తొలి రోజు బౌలర్లు, రెండో రోజు బ్యాటర్లు తేలిపోయారు. భారత్ ప్లేయర్స్‌కు ఇంకా ఐపీఎల్ మత్తు వీడలేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు భారీ స్కోర్ చేయగా.. అనంతరం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి 151/5తో నిలిచింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఒకదశలో 71/4తో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడగా.. ఆ సమయంలో రవీంద్ర జడేజా(48), అజింక్య రహనే(29) జట్టును ఆదుకున్నారు. కానీ చివర్లో జడేజాను ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా లయోన్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఆట చివరికి రహనే(29*)కు తోడుగా ఆంధ్రా ప్లేయర్ శ్రీకర్‌ భారత్‌ (5*) క్రీజులో ఉన్నాడు. భారత్ ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. మరో 118 పరుగులు చేయాల్సి ఉంది.

అంతకుముందు 327/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 142 పరుగులు జోడించి.. చివరి 7 వికెట్లు కోల్పోయింది. ట్రావిస్‌ హెడ్‌(163), స్టీవెన్‌ స్మిత్‌(121) సెంచరీలకు తోడుగా అలెక్స్‌ క్యారీ(48) విలువైన ఇన్నింగ్స్‌ ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలబెట్టాయి. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...