IND vs AUS WTC Final Day 2: టాపార్డర్ ప్లాఫ్ షో.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. ఇక డ్రా కోసం పోరాడాల్సిందే
ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రహానె ( 29), కేఎస్ భరత్ (5) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ (15), గిల్ (13), పుజారా (14), కోహ్లీ (14) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో టీమిండియా విజయావకాశాలు అడగంటిపోయాయి.

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా విజయావకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఇక డ్రా కోసమే భారత్ ఆడాల్సి ఉంది. అది కూడా అంత సులభమేమీ కాదు. ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రహానె ( 29), కేఎస్ భరత్ (5) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ (15), గిల్ (13), పుజారా (14), కోహ్లీ (14) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో టీమిండియా విజయావకాశాలు అడగంటిపోయాయి. ప్రస్తుతం భారత జట్టు ఆశలన్నీ రహానే పైనే ఉన్నాయి. మూడో రోజు భారత్ ఎంత సేపు బ్యాటింగ్ చేస్తుందనే దానిపైనే ఫలితం ఆధారరపడి ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే ఆస్ట్రేలియాకే గెలుపు అవకాశాలున్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (163 పరుగులు), స్టీవ్ స్మిత్ (121 పరుగులు) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (43), అలెక్స్ కారీ (42) పరుగులు చేశారు.భారత్ ఇంకా ఆస్ట్రేలియా కంటే 318 పరుగులు వెనుకబడి ఉంది.
కాగా ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందాన్ని ఆరంభంలోనే ఆవిరిచేశారు టీమిండియాబ్యాటర్లు. ఓపెనర్లు రోహిత్ (15), శుభ్‌మన్ గిల్ (13) నిరాశపర్చగా.. చెతేశ్వర్ పుజారా (14) కూడా విఫలమయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (14) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (48; 51 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్, కామెరూన్ గ్రీన్, నాథన్ లైయన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.




Stumps on Day 2 of the #WTC23 Final!#TeamIndia 151/5 at the end of day’s play and trail by 318 runs in the first innings.
Join us tomorrow for Day 3 action ????
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/dT7aOmDMWQ
— BCCI (@BCCI) June 8, 2023
? Milestone Alert
Congratulations to @mdsirajofficial who completes 5️⃣0️⃣ wickets in Test Cricket ????#TeamIndia | #WTC23 pic.twitter.com/1xcwgWFxS5
— BCCI (@BCCI) June 8, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
