Watch Video: వామ్మో.. ఇదేంది బ్రో.. ఇంత వెరైటీ బ్యాట్‌తో ‘కంగారు’ పెట్టిస్తున్నావ్.. స్టీవ్ స్మిత్‌పై నెటిజన్ల సెటైర్లు..
WTC 2023 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ ఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరుకు ఇరు జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. నెట్స్‌లో తీవ్రంగా చెమటలు పట్టిస్తున్నారు.
WTC 2023 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ ఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరుకు ఇరు జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. నెట్స్‌లో తీవ్రంగా చెమటలు పట్టిస్తున్నారు. తొలిసారి డబ్ల్యూటీసీ ట్రోఫీని చేతపట్టుకోవాలని ఇరుజట్లు ఆరాటపడుతున్నాయి.
తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. అందుకు గల కారణం కూడా వెరైటీగా ఉందండోయ్. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా వెరైటీ బ్యాట్‌తో బంతిని చితకబాదేస్తున్నాడు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా.. ఇదేంటి బ్రో ఇంత వెరైటీగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.
View this post on Instagram
స్టీవ్ స్మిత్ ఉపయోగించిన బ్యాట్ చాలా వెరైటీగా ఉంది. బ్యాట్ అంచులకు నలుపు రంగులో రంపం లాంటి పళ్లు కనిపించాయి. దీంతో నెటిజన్లు రాక్షసుల ఆయుధాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే బ్యాట్‌తో ప్రాక్టీస్ చేసిన స్మిత్ వీడియోను ఐసీసీ తన ట్విట్టర్లో పంచుకుంది.
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ జర్నీ..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, భారత్‌తో పాటు శ్రీలంక కూడా రెండో స్థానం కోసం రేసులో పాల్గొంది.
న్యూజిలాండ్ టూర్‌లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టెస్టు మ్యాచ్‌లో ఐదో రోజు చివరి బంతికి న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక ఓటమి నుంచి లాభపడిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..