AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCBW vs MIW: లేడీ కోహ్లీ జట్టుకు భారీ షాక్.. వరుసగా రెండో ఓటమి.. కట్ చేస్తే.. అగ్రస్థానం చేరిన ముంబై..

WPL 2024: 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. యాస్టికా భాటియా 31 పరుగులు చేయగా, హేలీ మాథ్యూస్ 26 పరుగులు చేసింది. 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నేట్ సీవర్ బ్రంట్ 27 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడగా, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మెలియా కెర్ 40 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు టోర్నీలో మూడో విజయాన్ని అందించింది.

RCBW vs MIW: లేడీ కోహ్లీ జట్టుకు భారీ షాక్.. వరుసగా రెండో ఓటమి.. కట్ చేస్తే.. అగ్రస్థానం చేరిన ముంబై..
Rcbw Vs Miw
Venkata Chari
|

Updated on: Mar 03, 2024 | 6:51 AM

Share

Womens Premier League 2024, RCBW vs MIW: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో ఎడిషన్ 9వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Mumbai Indians Women vs Royal Challengers Bangalore Women) మధ్య జరిగింది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. దీనికి సమాధానంగా ముంబై జట్టు 7 వికెట్లు కోల్పోయి 29 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది.

అగ్రస్థానం చేరిన ముంబై ఇండియన్స్..

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో బెంగళూరుపై తిరుగులేని రికార్డును కొనసాగించింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల్లో ముంబై అద్భుత విజయం సాధించింది. ముంబై కెప్టెన్ నేట్ సీవర్ బ్రంట్ 27 పరుగులిచ్చి బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టింది.

ఇవి కూడా చదవండి

42 పరుగులకే 4 వికెట్లు..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ నాట్-సెవర్ బ్రంట్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు చాలా చెడ్డ ఆరంభంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 42 పరుగులకే మొదటి 4 వికెట్లు కోల్పోయింది. ఇందులో కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ డివైన్ తలో 9 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చారు. సబినేని మేఘన 11 పరుగులు చేసి ఔట్ కాగా, రిచా ఘోష్ 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. మోలినెక్స్‌తో కలిసి ఎల్లీస్ పెర్రీ 5వ వికెట్‌కు 29 పరుగులు జోడించారు. ఆపై జార్జియా వార్‌హామ్‌తో కలిసి ఎల్లీస్ పెర్రీ ఆరో వికెట్‌కు 52 పరుగుల అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

కీలక భాగస్వామ్యం వచ్చినా..

ఎల్లీస్ పెర్రీ అజేయంగా 44 పరుగులు చేయగా, వర్హమ్ 27 పరుగుల ముఖ్యమైన సహకారం అందించింది. దీంతో బెంగళూరు జట్టును 131 పరుగులకు తీసుకెళ్లారు. ముంబై తరపున నేట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ తలో 2 వికెట్లు తీయగా, ఇజ్జీ వాంగ్, సైకా ఇషాక్ తలో ఒక వికెట్ సాధించారు.

ముంబై ఓపెనర్ల దూకుడు..

132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. యాస్టికా భాటియా 31 పరుగులు చేయగా, హేలీ మాథ్యూస్ 26 పరుగులు చేసింది. 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నేట్ సీవర్ బ్రంట్ 27 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడగా, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మెలియా కెర్ 40 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు టోర్నీలో మూడో విజయాన్ని అందించింది. బెంగళూరుకు చెందిన సోఫీ డివైన్, జార్జియా వర్హమ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీశారు.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

బెంగళూరు జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్‌హామ్, రాంకా పాటిల్, సిమ్రాన్ బహదూర్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

ముంబై ఇండియన్స్ జట్టు: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నేట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, ఎస్ సజ్నా, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, కీర్తన్ బాలకృష్ణన్, సైకా ఇషాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..