AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Match: విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచులు.. ఎప్పుడంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులు డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంను సందర్శించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సభ్యులతో సమావేశమయ్యారు. విశాఖలోని పీఎం పాలెం స్టేడియంలో DC రెండు మ్యాచ్‌లు ఆడనుంది. DC, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మొదటి మ్యాచ్ మార్చి 31న జరగాల్సి ఉండగా, DC.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య రెండవ మ్యాచ్ ఏప్రిల్ 3న జరుగుతుంది.

IPL Match: విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచులు.. ఎప్పుడంటే..
Ipl Match In Vishakapatnam
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Mar 02, 2024 | 7:40 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులు డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంను సందర్శించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సభ్యులతో సమావేశమయ్యారు. విశాఖలోని పీఎం పాలెం స్టేడియంలో DC రెండు మ్యాచ్‌లు ఆడనుంది. DC, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మొదటి మ్యాచ్ మార్చి 31న జరగాల్సి ఉండగా, DC.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య రెండవ మ్యాచ్ ఏప్రిల్ 3న జరుగుతుంది. రెండు మ్యాచ్‌లు డే అండ్ నైట్ మ్యాచ్ లే అని తెలుస్తోంది.

వసతులపై ఆరా..

DC జట్టు సభ్యులు, మ్యాచ్ అధికారులు, ఆటగాళ్ల కోసం అవసరమైన డ్రెస్సింగ్ రూమ్స్, కార్పొరేట్ బాక్సులను తనిఖీ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. ఏసీఏ సెక్రటరీ ఎస్.ఆర్. గోపీనాథ్‌రెడ్డి స్టేడియంలోని సౌకర్యాలను వారికి వివరించారు.

విశాఖ లో ఎందుకంటే..

మరోవైపు అన్ని జట్లు తమ హోం గేమ్స్‌ను సొంత మైదానాల్లో ఆడుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రమే విశాఖపట్నంలో కూడా ఆడనుండడంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగింది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్‌కు సొంత మైదానమైన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్‌ జరగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్‌ సెకెండ్‌ ఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు దాదాపు 10 పైనే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇలా వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్‌ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఢిల్లీ టీమ్ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్‌ ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు హోం గేమ్స్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. అదే సమయంలో రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన ఐదు హోం గేమ్స్‌ను సొంత మైదానంలోనే ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్ లకు అవసరమైన వసతుల కల్పనకొసమే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ విశాఖ గ్రౌండ్‎ను సందర్శించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..