Rishabh Pant: 48 గంటల్లో తేలనున్న రిషబ్ పంత్ భవితవ్యం.. ఫెయిలైతే, ఐపీఎల్ నుంచి ఔట్?
Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున 98 మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్ 1 సెంచరీ, 15 అర్ధసెంచరీలతో మొత్తం 2838 పరుగులు చేశాడు. గత ఏడాది కాలంగా మైదానానికి దూరంగా ఉన్న పంత్ ఇప్పుడు ఐపీఎల్ ద్వారా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అందుకు ముందు ఓ టెస్ట్ ఎదుర్కొబోతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant Fitness Test: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 2022 నుంచి క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉంటున్నాడు. కారు ప్రమాదం తర్వాత త్వరగా కోలుకున్న రిషబ్ పంత్, ఇప్పుడు రాబోయే IPL 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడబోతున్నాడు. దీని కోసం అభిమానులతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సౌరవ్ గంగూలీ కీలక అప్‌డేట్ ఇచ్చారు.
పంత్ ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయితేనే..
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. తాను ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. అందుకే నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) అతనికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తుంది. రిషబ్ పంత్ ఫిట్‌నెస్ పరీక్ష మార్చి 5న (అంటే 48 గంటల తర్వాత) జరగనుంది. దీని తర్వాత మాత్రమే మేం పంత్ కెప్టెన్సీ కోసం బ్యాకప్ ఎంపికను పరిశీలిస్తామం. కాబట్టి మేం పెద్దగా హైప్ సృష్టించడం లేదు. అతని ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా?
సౌరవ్ గంగూలీ ఇంకా మాట్లాడుతూ.. మరి పంత్ ఎలా చేస్తాడో చూడాలి. అతను ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే అతను ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో చేరగలడు. అందువల్ల మనం పెద్దగా అంచనా వేయలేం. వికెట్ కీపింగ్ విషయానికి వస్తే, మాకు కుమార్ కుషాగ్రా, రికీ భుయ్, షాయ్ హాప్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి అద్భుతమైన ఎంపికలు కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.
2022 సంవత్సరం తర్వాత తిరిగొస్తోన్న పంత్..
రిషబ్ పంత్ 2022 సంవత్సరం చివరిలో డిసెంబర్ నెలలో ఢిల్లీ నుంచి రూర్కీ ఇంటికి వెళ్తుండగా ఘోర కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి పంత్ ప్రాణం తృటిలో బయటపడింది. కానీ, ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అనేక శస్త్రచికిత్సల తర్వాత, అతను మళ్లీ మైదానంలోకి రావాలని ప్లాన్ చేశాడు. పంత్ గత రెండేళ్లుగా క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. అతని పునరాగమనం కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే IPL 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్ మార్చి 23న జరగనుంది. ఈ మ్యాచ్‌లో పంత్ పునరాగమనం చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








