AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH New Captain: ఇదేంది కావ్యాపాప ఇలా చేస్తివి.. హైదరాబాద్ కెప్టెన్‌గా మార్క్రామ్ ఔట్.. జట్టు పగ్గాలు విశ్వ విజేత చేతికి?

Pat Cummins May Replace Aiden Markram: ఐపీఎల్ 2023లో ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలవగలిగింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ 2024లో మార్క్రామ్‌ను జట్టుకు కెప్టెన్‌గా ఉంచాలా లేక కొత్త ముఖానికి ఈ బాధ్యతను అప్పగించాలా అనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోంది. మార్క్రామ్ కెప్టెన్సీలో హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు ఈస్టర్న్ క్యాప్ SA20 లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

SRH New Captain: ఇదేంది కావ్యాపాప ఇలా చేస్తివి.. హైదరాబాద్ కెప్టెన్‌గా మార్క్రామ్ ఔట్.. జట్టు పగ్గాలు విశ్వ విజేత చేతికి?
IPL 2024 Pat Cummins SRH Captain
Venkata Chari
|

Updated on: Mar 03, 2024 | 8:06 AM

Share

 Sunrisers Hydarabad New Captain: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్‌పై చర్చలు మొదలయ్యాయి. లీగ్ 17వ సీజన్‌కు పాట్ కమిన్స్‌ను జట్టుకు కెప్టెన్‌గా నియమించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. IPL 2024 వేలంలో కమిన్స్‌ను హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతనికి జట్టు కమాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఐడెన్ మార్క్రామ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఐపీఎల్ 2023లో ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలవగలిగింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ 2024లో మార్క్రామ్‌ను జట్టుకు కెప్టెన్‌గా ఉంచాలా లేక కొత్త ముఖానికి ఈ బాధ్యతను అప్పగించాలా అనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోంది. మార్క్రామ్ కెప్టెన్సీలో హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు ఈస్టర్న్ క్యాప్ SA20 లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి సారథిని వదులుకోవడానికి హైదరాబాద్ జట్టు సిద్ధంగా ఉందా లేదా అని తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌కు కమిన్స్‌ కెప్టెన్‌గా ఉండొచ్చు..

అయితే, గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలిపిన పాట్ కమిన్స్ ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్సీని చేపట్టేందుకు సిద్ధమయ్యాడని ఇప్పుడు స్పష్టమైంది.

గత మూడు సీజన్లలో పేలవంగా హైదరాబాద్ ప్రదర్శన..

డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. 2016, 2020 మధ్య అంటే 2016లో విజయవంతమైన IPL ప్రచారంతో సహా ప్రతి సీజన్‌లో ప్లేఆఫ్‌లకు అర్హత సాధించారు. ఆ తర్వాత, జట్టు ప్రదర్శన క్షీణించడం ప్రారంభించింది. తరువాతి మూడు సీజన్లలో జట్టు 8, 9, 10వ స్థానాల్లో నిలిచింది. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌ని మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు..

మయాంక్ అగర్వాల్, ఫజల్హక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మార్క్రామ్, టి నటరాజన్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, వానిందు హసరంగా, ఆకాష్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..