WPL 2023: అవి బంతులా? బుల్లెట్లా?.. అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీతో రికార్డు బద్దలు కొట్టిన బెంగళూరు స్టార్ ప్లేయర్
వరుస పరాజయాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎట్టకేలకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మొదటి విజయాన్ని అందుకుంది. బుధవారం (మార్చి 16) జరిగిన తన ఆరో మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది.

వరుస పరాజయాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎట్టకేలకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మొదటి విజయాన్ని అందుకుంది. బుధవారం (మార్చి 16) జరిగిన తన ఆరో మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. క్లిష్ట పరిస్థితుల్లో 46 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన 20 ఏళ్ల బ్యాటర్ కనికా అహుజా బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే బెంగళూరు విజయంలో మరో ప్లేయర్ పాత్ర కూడా ఉంది. ఆమె పేరే ఎలీస్ పెర్రీ. ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో అద్భుతాలు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన పెర్రీ 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అయితే ఈ సూపర్ గణాంకాలతో పాటు ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పిందీ స్టార్ ప్లేయర్. అదేంటంటే.. పెర్రీ వేసిన 3 ఓవర్ 5వ బంతి 130.5 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఇది మహిళల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బంతి కావడం విశేషం.
కాగా గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ పేరిట ఉండేది. గత నెలలో జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో షబ్నిమ్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ రికార్డును పెర్రీ బద్దలు కొట్టింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కనికా ఆహుజా 46 పరుగులతో బెంగళూరును గెలిపించింది.




Ellyse Perry yesterday clocked 130.5kmph – probably the fastest ball in women’s T20 cricket. pic.twitter.com/dcOEZenVNH
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 16, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..