AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: కెప్టెన్‌గా హార్దిక్.. తొలి వన్డేలో కోహ్లీ ఫ్రెండ్‌కి నో ప్లేస్.. లిస్టులో టీ20 స్పెషలిస్టులు.!

మార్చి 17వ తేదీ నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో..

IND vs AUS: కెప్టెన్‌గా హార్దిక్.. తొలి వన్డేలో కోహ్లీ ఫ్రెండ్‌కి నో ప్లేస్.. లిస్టులో టీ20 స్పెషలిస్టులు.!
Ind Vs Aus
Ravi Kiran
|

Updated on: Mar 16, 2023 | 5:28 PM

Share

మార్చి 17వ తేదీ నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగుతుంది. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలన్న లక్ష్యంతో అటు ఆసీస్.. ఇటు భారత్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, టీమ్ ఇండియా ఏ ప్లేయింగ్ XIతో దిగుతుంది? రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టు సారధ్య బాధ్యతలను తీసుకోబోతున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత జడేజా మళ్లీ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో తొలి వన్డేకు టీమిండియా 5 మంది బ్యాట్స్‌మెన్లు, 3 ఆల్‌రౌండర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

టీమిండియా 5 బ్యాట్స్‌మెన్‌లు ఎవరు?

టీమిండియా ఓపెనింగ్ బాధ్యతలు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్‌.. మూడో స్థానాన్ని విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు. ఇక ఫినిషర్‌గా కేఎల్ రాహుల్ ఆడవచ్చు. మరి ఇంతకీ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా ఇషాన్ కిషన్ అనేది ప్రశ్న.

ముగ్గురు ఆల్‌రౌండర్లు, 2 ఫాస్ట్ బౌలర్లు..

భారత జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్ల పాత్రలను కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ పోషించనున్నారు. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లపై ఆధారపడతాయి. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రంగంలోకి దిగవచ్చు.

భారత్(ప్లేయింగ్ XI అంచనా):

శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా(ప్లేయింగ్ XI అంచనా):

ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్/మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..

తొలి వన్డే – మార్చి 17, ముంబై

రెండో వన్డే – మార్చి 19, విశాఖపట్నం

మూడో వన్డే – మార్చి 22, చెన్నై