గిల్‌క్రిస్ట్‌కు నిజంగానే అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా? వరల్డ్‌ రిచెస్ట్‌ క్రికెటర్‌ వార్తల వెనక అసలు విషయమిదే..

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి గిల్‌క్రిస్ట్‌ రిటైరయ్యి సుమారు 15 ఏళ్లు గడుస్తోంది. ఐపీఎల్‌ ఆడక కూడా ఎన్నో ఏళ్లు గడిచాయి. పైగా బయట కూడా ఎలాంటి లీగుల్లోనూ ఆడడం లేదు. ప్రస్తుతం కామెంటేటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు.

గిల్‌క్రిస్ట్‌కు నిజంగానే అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా? వరల్డ్‌ రిచెస్ట్‌ క్రికెటర్‌ వార్తల వెనక అసలు విషయమిదే..
Adam Gilchrist
Follow us

|

Updated on: Mar 16, 2023 | 5:20 PM

వరల్డ్ ఇండెక్స్ ఇటీవల 2023కి గానూ ప్రపంచంలోని టాప్ 10 సంపన్న క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అగ్రస్థానంలో నిలిచాడు. 2023లో గిల్‌క్రిస్ట్ నికర ఆస్తుల విలువ దాదాపు 380 మిలియన్ అమెరికన్‌ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ. 3100 కోట్లు. ఈ జాబితాలో ప్రస్తుతం ఆడుతున్న విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ వంటి దిగ్గజాలు కూడా గిల్‌క్రిస్ట్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన సచిన్ టెండూల్కర్ నికర విలువ రూ. 170 మిలియన్‌ డాలర్లు.. అంటే రూ.1400 కోట్లు. మూడో స్థానంలో నిలిచిన ఎంఎస్‌ ధోని ఆస్తుల విలువ దాదాపు 11 మిలియన్ డాలర్లు ( రూ.1100 కోట్లు). నాలుగో ప్లేసులో కోహ్లీ, ఐదో స్థానంలో రికీ పాంటింగ్‌ ఉన్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి గిల్‌క్రిస్ట్‌ రిటైరయ్యి సుమారు 15 ఏళ్లు గడుస్తోంది. ఐపీఎల్‌ ఆడక కూడా ఎన్నో ఏళ్లు గడిచాయి. పైగా బయట కూడా ఎలాంటి లీగుల్లోనూ ఆడడం లేదు. ప్రస్తుతం కామెంటేటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. మరి ఎలాంటి ఆదాయ మార్గాలు లేని గిల్‌క్రిస్ట్‌ ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్‌ ఎలా అయ్యాడబ్బా? అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ సందేహాలు వెలిబుచ్చారు. ఇప్పుడిదే నిజమైంది.

వాస్తవానికి, వరల్డ్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఫిట్‌నెస్ జిమ్ సెంటర్ యజమాని. ఆడమ్ గిల్‌క్రిస్ట్ F45 ఫిట్‌నెస్ జిమ్‌ను నడుపుతున్న ఒక అమెరికన్ నివాసి. గిల్‌క్రిస్ట్ అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక జిమ్ ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. 2022లో అతను సుమారూ 500 మిలియన్ అమెరికన్‌ డాలర్ల ఆదాయంతో వార్తల్లో నిలిచాడు.అలాగే న్యూయార్క్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తన కంపెనీని ప్రవేశపెట్టినప్పుడు గిల్‌క్రిస్ట్‌ పేరు బాగా మార్మోగిపోయింది. ఇప్పుడీ గందరగోళానికి కూడా ఈ గిల్ క్రిస్టే కారణం. దీనిపై ఆసీస్ క్రికెటర్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.  ‘నా సంపద 3800 కోట్లు కాదు. నేను సచిన్-విరాట్, ధోనీల కంటే ధనవంతుడ్ని కాదు. అలాగే 3800 కోట్ల ఆస్తులున్న ఆడమ్ గిల్‌క్రిస్ట్ మరో వ్యక్తి. కాబట్టి ఈ నివేదికలో ఏ మాత్రం నిజంలేదు’  అని క్లారిటీ ఇచ్చాడు.  ఇదిలా ఉంటే ఆసీస్‌ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ నికర ఆస్తుల విలువపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సో.. ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్‌ గిల్‌క్రిస్ట్‌ అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.  అంటే టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కరే ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..