Naatu Naatu: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్లు.. గ్రౌండ్‌లోనే సూపర్బ్ డ్యాన్స్.. వైరల్ వీడియో
ఇండియన్ సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో ఇండియా లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లో నాటునాటు పాటకు స్టెప్పులేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. ముఖ్యంగా ఆస్కార్ వచ్చిన తర్వాత ఈ పాటకున్న క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో అయితే నాటు కొట్టుడు సాంగ్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. సందర్భమేదైనా ఈ పాటను రీక్రియేట్ చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. నెటిజన్లు కూడా ఎంతో హుషారుగా ఆర్‌ఆర్‌ఆర్ పాటకు కాలు కదుపుతున్నారు. తాజాగా ఇండియన్ సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో ఇండియా లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లో ఆర్ఆర్ఆర్ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను లెజెండ్స్ క్రికెట్ లీగ్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజెన్లు ‘వావ్, సూపర్బ్ డ్యాన్స్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లయన్స్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తరంగ (69) టాప్ స్కోరర్. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లయన్స్ 12.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. రాబిన్ ఊతప్ప (39 బంతుల్లో 88), గౌతమ్ గంభీర్ (36 బంతుల్లో 61) చెలరేగి ఆడారు.




Those are some sweet feet, I tell you what! ?@IndMaharajasLLC @harbhajan_singh @ImRaina #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/Kv9y1ss6bs
— Legends League Cricket (@llct20) March 15, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..