Video: వామ్మో.. ఇదేం ఉతుకుడు సామీ.. 43 బంతుల్లో 14 ఫోర్లు, 22 సిక్సర్లతో తుఫాన్ సెంచరీ.. 448 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత..
Hamza Saleem Dar World Record: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కాటలున్యా జాగ్వార్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 257 పరుగులు చేసింది. హమ్జాతో పాటు సహచర ఓపెనర్ యాసిర్ అలీ 19 బంతుల్లో 58* పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించిన సోహల్ హాస్పిటల్ 10 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్‌లో అద్భుతాలు చేసిన హమ్జా.. బౌలింగ్ లోనూ మెరిశాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు.
Cricket World Record: క్రికెట్ ఆటలో ప్రతిరోజూ కొన్ని కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే రికార్డ్ కేవలం రికార్డ్ మాత్రమే కాదండోయ్.. అంతకుమించి అనుకోవాల్సిందే. ఇలాంటి ప్రపంచ రికార్డు గురించి మీరు ఇంతకు ముందెన్నడూ విని ఉండరు. యూరోపియన్ క్రికెట్ టీ10 మ్యాచ్‌లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన హమ్జా సలీమ్ దార్ అనే బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్‌ను తన పేరుతో లిఖించుకున్నాడు.
సోహల్ హాస్పిటలెట్‌తో జరిగిన మ్యాచ్‌లో కాటలూన్యా జాగ్వార్‌కు చెందిన హంజా సలీమ్ క్రికెట్‌లో చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హంజా కేవలం 43 బంతుల్లో 14 ఫోర్లు, 22 సిక్సర్లతో 193* పరుగులతో అజేయంగా నిలిచాడు. బౌలర్లను దారుణంగా చితకబాది టీ10 క్రికెట్‌లో తన పేరుతో అద్బుతమైన రికార్డును లిఖించుకున్నాడు. టీ10 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో హమ్జా కేవలం 24 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. ఈ అజేయ ఇన్నింగ్స్‌లో హమ్జా స్ట్రైక్ రేట్ 448.83లుగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో హమ్జా ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన ఘనత కూడా సాధించాడు.
6 సిక్సర్లు బాదిన ఆ ఓవర్‌లో మొత్తం 43 పరుగులు రాబట్టుకున్నాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో, మహ్మద్ వారిస్ 6 సిక్సర్లు కొట్టాడు. అందులో అతను 6 కాదు మొత్తం 9 బంతుల్లో బౌలింగ్ చేశాడు. ఇందులో 2 వైడ్లు, 1 నో బాల్ ఉన్నాయి. ఈ విధంగా హమ్జా ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్‌ను పూర్తి చేశాడు.
హమ్జా సలీమ్ దార్ తుఫాన్ బ్యాటింగ్..
𝗪𝗢𝗥𝗟𝗗 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 𝗞𝗡𝗢𝗖𝗞!🤯
Hamza Saleem Dar’s 43-ball 1️⃣9️⃣3️⃣ not out is the highest individual score in a 10-over match.😍 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/4RQEKMynu2
— European Cricket (@EuropeanCricket) December 6, 2023
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కాటలున్యా జాగ్వార్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 257 పరుగులు చేసింది. హమ్జాతో పాటు సహచర ఓపెనర్ యాసిర్ అలీ 19 బంతుల్లో 58* పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించిన సోహల్ హాస్పిటల్ 10 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్‌లో అద్భుతాలు చేసిన హమ్జా.. బౌలింగ్ లోనూ మెరిశాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..