- Telugu News Photo Gallery Cricket photos Mystery Girl Rajal Arora Do You Know Who This Girl Was On The Flight With Team India Players
IND vs SA: టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఫ్లైట్ ఎక్కిన మిస్టరీ గర్ల్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Mystery Girl Rajal Arora: దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరినప్పుడు రింకూ సింగ్ షేర్ చేసిన ఫొటోలో ఒక మహిళ కూడా కనిపిస్తుంది. ఆ ఫొటో చూడగానే చాలా మంది ఆమె ఎవరంటూ ఆరా తీస్తున్నారు. అసలు ఈ మహిళ ఎవరు, టీమిండియాతో ఎందుకు జర్నీ చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆమె రింకూ స్నేహితురాలా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా, ఆమె ఎయిర్‌లైన్స్ సిబ్బంది కావొచ్చని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Updated on: Dec 08, 2023 | 1:25 PM

Mystery Girl Rajal Arora: దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం యంగ్ ఇండియా ఇప్పటికే రింకూ సింగ్, యశస్వీ జైస్వాల్, రుతురాజ్, అర్షదీప్ సింగ్, తిలక్ వర్మలతో సహా ఆటగాళ్లు సౌతాఫ్రికాకు చేరుకున్నారు. డిసెంబర్ 10 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా తన X ఖాతాలో దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్ల వీడియోను షేర్ చేసింది. భారత ఆటగాళ్లు కూడా తమ సోషల్ మీడియా సైట్లలో ఫొటోలను షేర్ చేశారు. వీటిలో, రింకు సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విమానంలో తన సహచరులతో కలిసి ఒక ఫొటోను పంచుకున్నారు. అది వైరల్ అయ్యింది.

రింకూ సింగ్ షేర్ చేసిన ఫొటోలో ఒక మహిళ కూడా కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే చాలా మంది ఆమె ఎవరా అంటూ వెతుకుతున్నారు. ఈ ఫొటోలో రింకు, కుల్దాదీప్ యాదవ్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్, మరో ఇద్దరు సహాయక సిబ్బంది ఉన్నారు.

వీరితో పాటు ఒక మహిళ కూడా కనిపిస్తుంది. ఆమె రింకూ స్నేహితురాలా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా, ఆమె ఎయిర్‌లైన్స్ సిబ్బంది కావొచ్చని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు రాజల్ అరోరా.

రాజల్ అరోరా టీమ్ ఇండియా, IPL డిజిటల్ మీడియా మేనేజర్. ఆమె ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. రాజల్ గత 8 ఏళ్లుగా బీసీసీఐలో పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్స్ 60 వేలకు చేరువలో ఉన్నారు.

రాజల్ అరోరా పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ నుండి పట్టభద్రురాలైంది. రాజల్ స్కూల్లో బాస్కెట్ బాల్ ఆడేది. 2015 నుంచి బీసీసీఐలో పనిచేస్తోంది. రాజల్ అరోరా గతంలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మతో కలిసి అనేక పర్యటనలలో కనిపించింది.




