AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs PAK: పాక్ చేతిలో టీమిండియా ప్రపంచకప్ భవిష్యత్తు.. అలా జరిగితేనే సెమీఫైనల్‌లోకి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్స్‌కు చేరాలంటే.. పాకిస్తాన్ తప్పనిసరిగా తమ చివరి మ్యాచ్‌లో గెలిచి తీరాలి. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

IND Vs PAK: పాక్ చేతిలో టీమిండియా ప్రపంచకప్ భవిష్యత్తు.. అలా జరిగితేనే సెమీఫైనల్‌లోకి
Ind Vs Pak
Ravi Kiran
|

Updated on: Oct 12, 2024 | 4:38 PM

Share

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్స్‌కు చేరాలంటే.. పాకిస్తాన్ తప్పనిసరిగా తమ చివరి మ్యాచ్‌లో గెలిచి తీరాలి. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో పాక్ జట్టు నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. ఇది కాస్తా టీమిండియాకు ప్లస్ పాయింట్ అయింది. సెమీఫైనల్ రేసులో భాగంగా పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాపై ఓడిపోయి.. ప్రస్తుతం నెట్ రన్‌రేట్ -0.488తో నిలిచింది. ఇక చివరి మ్యాచ్ గెలిచినా కూడా పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడం కష్టమే.

కానీ టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే.. చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు గెలిచి తీరాల్సిందే. పాకిస్థాన్ జట్టు తమ చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. న్యూజిలాండ్ జట్టుకు ఈ మ్యాచే కీలకం. ఎందుకంటే శ్రీలంకపై న్యూజిలాండ్ గెలిస్తే మొత్తం 4 పాయింట్లతో.. టీమిండియాను అధిగమించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వచ్చే ఛాన్స్‌లు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇక భారత జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధిస్తే, 6 పాయింట్లతో తిరిగి రెండో స్థానానికి చేరుకోవచ్చు. అయితే టీమిండియా సెమీఫైనల్ ఛాన్స్ ఖాయమని చెప్పలేం. ఎందుకంటే లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే టీమిండియా సెమీఫైనల్‌లోకి ప్రవేశించడం దాదాపు ఖాయం. లేదంటే ఇంటికి వెళ్లాల్సిందే. కాబట్టి భారత జట్టు సెమీఫైనల్ భవితవ్యం ఇప్పుడు పాకిస్థాన్ చేతిలో ఉందనడంలో అతిశయోక్తి లేదు.

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా సెమీ ఫైనల్ ఛాన్స్‌లు:

ఆస్ట్రేలియాపై టీమిండియా భారీ విజయం సాధించాలి. శ్రీలంక లేదా పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ తప్పనిసరిగా ఓడిపోవాలి. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచినా, భారత్ కంటే ఎక్కువ నెట్ రన్‌రేట్ సాధించలేదు.

రాబోయే మ్యాచ్‌ల షెడ్యూల్:

అక్టోబర్ 13: భారత్ vs ఆస్ట్రేలియా అక్టోబర్ 14: పాకిస్థాన్ vs న్యూజిలాండ్

మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్-A పాయింట్ల పట్టిక:

జట్లు మ్యాచ్‌లు గెలుపు ఓటమి N/R పాయింట్లు నెట్ రన్‌రేట్
ఆస్ట్రేలియా 3 3 0 0 6 +2.786
భారత్ 3 2 1 0 4 +0.576
న్యూజిలాండ్ 2 1 1 0 2 -0.050
పాకిస్తాన్ 3 1 2 0 2 -0.488
శ్రీలంక 3 0 3 0 0 -2.564

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్