AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: మరో మూడు రోజుల్లో మహిళల ధనాధన్‌ లీగ్‌ ‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఫిబ్రవరి 23న సాయంత్రం ఘనంగా ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ప్రత్యేకంగా బెంగళూరులో నిర్వహించనున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ ఎం. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఫిబ్రవరి 23న చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరగనుంది

WPL 2024: మరో మూడు రోజుల్లో మహిళల ధనాధన్‌ లీగ్‌ ‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.. లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
WPL 2024
Basha Shek
|

Updated on: Feb 20, 2024 | 11:27 AM

Share

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) టోర్నమెంట్ రెండో ఎడిషన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ఈసారి క్రికెట్ ప్రేమికులు డబ్ల్యుపిఎల్ నుండి డబుల్ ఆనందాన్ని పొందనున్నారు. ఫిబ్రవరి 23న సాయంత్రం ఘనంగా ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ప్రత్యేకంగా బెంగళూరులో నిర్వహించనున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ ఎం. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఫిబ్రవరి 23న చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరగనుంది. బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ఈసారి డబ్ల్యూపీఎల్ ప్రారంభోత్సవ వేదికపై అలరించనున్నాడు. ఈ విషయాన్ని బోర్డు సోషల్ మీడియాలో ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. దానికి గంట ముందు ప్రారంభోత్సవం జరగనుంది. WPL ప్రారంభ వేడుక వేదికపై కార్తీక్‌తో పాటు ఏ ఇతర తారలు మెరవనున్నారనేది ఇంకా తెలియరాలేదు.

గతేడాది కూడా టోర్నీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, కృతి షానన్‌ల డ్యాన్స్ బీట్‌కు డివై పాటిల్ స్టేడియం మార్మోగింది. ఆయనతో పాటు ప్రముఖ గాయకుడు ఏపీ ధిల్లాన్ గ్యాలరీలో ప్రేక్షకులను అలరించారు.

ఇవి కూడా చదవండి

WPL ప్రారంభోత్సవ వేడుకల వివరాలివే..

తేదీ: ఫిబ్రవరి 23, (శుక్రవారం)

సమయం : 06:30 PM నుండి

వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

WPL లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

WPL ప్రారంభ వేడుకతో సహా మొత్తం టోర్నమెంట్‌ను JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా చూడవచ్చు. మరోవైపు, టోర్నమెంట్ ప్రసార హక్కులను స్పోర్ట్స్ 18 ఛానెల్ దక్కించుకుంది.

WPL 2024 పూర్తి షెడ్యూల్

  • ఫిబ్రవరి 23: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు
  • ఫిబ్రవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్, బెంగళూరు
  • ఫిబ్రవరి 25: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్, బెంగళూరు
  • ఫిబ్రవరి 26: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు
  • ఫిబ్రవరి 27: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్, బెంగళూరు
  • ఫిబ్రవరి 28: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్, బెంగళూరు
  • ఫిబ్రవరి 29: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు
  • మార్చి 1: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్, బెంగళూరు
  • మార్చి 2: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్, బెంగళూరు
  • మార్చి 3: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు
  • మార్చి 4: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బెంగళూరు
  • మార్చి 5: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్, ఢిల్లీ
  • మార్చి 6: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ
  • మార్చి 7: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్, ఢిల్లీ
  • మార్చి 8: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్, ఢిల్లీ
  • మార్చి 9: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ
  • మార్చి 10: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ
  • మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్, ఢిల్లీ
  • మార్చి 12: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ
  • మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ
  • మార్చి 15: ఎలిమినేటర్, ఢిల్లీ
  • మార్చి 17: ఫైనల్, ఢిల్లీ

బెంగళూరులో ఓపెనింగ్ సెర్మనీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..