Team India: ‘మళ్లీ బంగ్లాకు కెప్టెన్‌గా షకిబ్.. ఇక రోహిత్‌సేనదే వన్డే వరల్డ్‌కప్ అట..’ ఫ్యాన్స్ జోస్యం..
2023 వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా టోర్నమెంట్ ఇండియాలో జరగనుంది. ఇంతకు ముందు మూడుసార్లు భారత్‌లో ప్రపంచకప్ నిర్వహించగా, మూడుసార్లు పొరుగు దేశం సహకారంతోనే భారత్‌లో ఈ మెగా టోర్నీని జరిగింది. 1987లో పాకిస్థాన్‌తో, 1996లో పాకిస్థాన్, శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకతో కలిసి భారత్ ప్రపంచకప్‌ను నిర్వహించింది. 2011లో టీమ్ ఇండియా కూడా ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు టీమిండియా ఏ ఒక్క ఐసీసీ టోర్నమెంట్‌లోనూ..

ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌నకు ముందుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ దేశ జాతీయ వన్డే జట్టుకు షకీబుల్ హసన్ మరోసారి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రిటైర్మెంట్ విత్ డ్రా చేసుకుని జట్టులోకి వచ్చిన తమీమ్ ఇక్బాల్ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో అతడి స్థానంలో సారధ్య బాధ్యతలను షకీబ్ చేపట్టనున్నాడు. బంగ్లాకు మరోసారి కెప్టెన్‌గా షకిబుల్ హసన్ కావడంతో.. భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. షకీబ్ కెప్టెన్ కాగానే.. వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాలు అమాంతం పెరిగాయని ఫ్యాన్స్ అంటున్నారు. దీని వెనుక కారణం లేకపోలేదు. గతంలో షకీబ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడే, టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
2023 వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా టోర్నమెంట్ ఇండియాలో జరగనుంది. ఇంతకు ముందు మూడుసార్లు భారత్‌లో ప్రపంచకప్ నిర్వహించగా, మూడుసార్లు పొరుగు దేశం సహకారంతోనే భారత్‌లో ఈ మెగా టోర్నీని జరిగింది. 1987లో పాకిస్థాన్‌తో, 1996లో పాకిస్థాన్, శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకతో కలిసి భారత్ ప్రపంచకప్‌ను నిర్వహించింది. 2011లో టీమ్ ఇండియా కూడా ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఐసీసీ మెగా టోర్నమెంట్లలో భారత్ పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది.
షకీబ్, టీమిండియా కనెక్షన్..
మరోసారి ఈ మెగా ఈవెంట్ భారతదేశానికి తిరిగి వచ్చింది. దీంతో మళ్లీ టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే గోల్డెన్ ఛాన్స్ ఉందని దేశంలోని ప్రతి అభిమాని భావిస్తునండు. ఆ తర్వాత యాదృచ్ఛికంగా షకీబ్ బంగ్లాదేశ్ కెప్టెన్సీని మరోసారి చేజిక్కించుకోవడం జరిగింది. ప్రపంచకప్‌లోనూ ఆ దేశ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2011 ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా షకిబుల్ హసనే వ్యవహరించడం ఆసక్తికరం.
షకీబ్, టీమిండియా లక్ కనెక్షన్..
అప్పుడు 2011లో, ఇప్పుడు 2023లో భారతదేశం ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్‌లో షకీబ్ తన జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడు. ఆ సమయంలో టీమిండియా ట్రోఫీ సాధించింది. ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. 2011లో టీమిండియాకు ఎలాంటి సీన్స్ రిపీట్ అయ్యాయో.. అదే ఇప్పుడూ జరుగుతున్నాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
- ప్రధాన ఈవెంట్‌కు ముందు టీమిండియా 2 వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి వార్మప్ మ్యాచ్‌లో, సెప్టెంబర్ 30న గౌహతిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుండగా, 2011లో కూడా వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది.
- నెదర్లాండ్స్ జట్టు 2011 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో.. అలాగే 2023 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో సఫలం అయింది. క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
- 2011 ప్రపంచకప్ ఆడకముందు 2010లో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ ఏడాది కూడా టీ20 ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్ వన్డే ప్రపంచకప్‌ను ఆడనుంది . ఇక గతేడాది ఇంగ్లాండ్ టీ20 ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
షకిబుల్ హసన్ ప్రపంచకప్ రోల్స్ కింద ట్వీట్‌లో:
Shakib Al Hasan in World Cups:
2007 – Player 2011 – Captain 2015 – Player 2019 – Player 2023 – Captain* pic.twitter.com/jIZ2KHAvEg
— Johns. (@CricCrazyJohns) August 11, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..




