AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌తో రూ. 11.45 కోట్లు..! విరాట్ కోహ్లి సమాధానమిదే..

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతదేశ అథ్లెట్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సోషల్ మీడియా సంపాదన ఇన్ని కోట్లంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఒక కమర్షియల్ పోస్ట్ ద్వారా రూ. 11.45 కోట్లు సంపాదిస్తున్నట్లు పేర్కొంది. ఇక ఇది కాస్తా క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అలాగే కొందరు ఈ వార్తపై మీమ్స్ కూడా చేశారు. దానితో స్వయంగా కోహ్లినే స్పందిస్తూ.. ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌లో ఉన్న గందరగోళాన్ని క్లియర్ చేశాడు. ఇంతకీ అదేంటంటే.?

Virat Kohli: ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌తో రూ. 11.45 కోట్లు..! విరాట్ కోహ్లి సమాధానమిదే..
Virat Kohli(file Photo)
Ravi Kiran
|

Updated on: Aug 12, 2023 | 12:22 PM

Share

ఆన్ ది ఫీల్డ్.. ఆఫ్ ది ఫీల్డ్‌లో టీమిండియా క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలాగే సోషల్ మీడియాలో అతడ్ని ఫాలో అవుతున్న అభిమానులు కొట్లలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతదేశ అథ్లెట్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ సోషల్ మీడియా సంపాదన ఇన్ని కోట్లంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై తాజాగా విరాట్ స్పందించాడు. తన సంపాదనపై వస్తోన్న వార్తలను టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి ఖండించారు.

ఇటీవల హాప్పర్ హెడ్‌క్వార్టర్స్ అనే వార్తా సంస్థ.. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక కమర్షియల్ పోస్ట్ ద్వారా రూ. 11.45 కోట్లు సంపాదిస్తున్నట్లు పేర్కొంది. ఇక ఇది కాస్తా క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అలాగే కొందరు ఈ వార్తపై మీమ్స్ కూడా చేశారు. దానితో స్వయంగా కోహ్లినే స్పందిస్తూ.. ఈ వార్తపై క్లారిటీ ఇచ్చాడు. ‘నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారం అవుతున్న వార్తలు నిజం కాదు. జీవితంలో నేను సాధించిన విజయాలకు మీకు రుణపడి ఉన్నాను’ అని ట్వీట్ చేశాడు.

విరాట్ కోహ్లి ఏమన్నాడో ఈ ట్వీట్‌లో..

అత్యధికంగా సంపాదిస్తున్న ఆసియన్లు:

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆసియన్లలో కోహ్లి మొదటిస్థానంలో ఉన్నట్టు ఆ సంస్థ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌తో అత్యధిక డబ్బును సంపాదిస్తున్న ఆటగాడిగా మొదటి స్థానంలో ఉండగా.. లియోనెల్ మెస్సీ రెండో స్థానం, ఈ లిస్ట్‌లో విరాట్ మూడో స్థానంలో ఉన్నట్టు చెప్పింది. ఇక కోహ్లి తర్వాత బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రూ.4.4 కోట్లు సంపాదించిందని తెలిపింది.

ఆసియా కప్‌లో పునరాగమనం..

విరాట్ కోహ్లీ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. వెస్టిండీస్ టూర్‌లో టీమిండియాతో కలిసి వెళ్లిన అతడు టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత, కేవలం ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఇక ఈ విరామంలో, విరాట్ రాబోయే రెండు భారీ టోర్నమెంట్లకు పక్కా ప్రణాళికతో సిద్దమవుతున్నాడు. ఆగస్టు 30న ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో భారత్ పాల్గొనాల్సి ఉంది. ఇందులో టీమిండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. దీని తర్వాత భారత్‌కు అతి పెద్ద సవాల్‌ ఇండియా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌. ఈ రెండు టోర్నీల్లోనూ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో కనిపించడం టీమ్ ఇండియాకు చాలా అవసరం.

విరాట్ ఇన్‌స్టా సంపాదనపై మీమ్..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..