IPL 2025: ఐపీఎల్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఔట్? చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక అప్‌డేట్
IPL 2025: ఐపీఎల్ రాబోయే సీజన్ ప్రారంభ మ్యాచ్ మార్చి 21న ప్రారంభమవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అలాగే, రాబోయే ఐపీఎల్ 2025లో కొన్ని కీలక రూల్స్ మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి సంబంధించి ఓ కీలక వార్త బయటకు వచ్చింది. ఐపీఎల్ రాబోయే సీజన్ ప్రారంభ మ్యాచ్ తేదీని ఐపీఎల్ ఛైర్మన్ ఖరారు చేశారు. తదుపరి సీజన్ మార్చి 21న ప్రారంభమవుతుందని తెలిపిన సంగతి తెలిసిందే. అరుణ్ ధుమాల్ కంటే ముందు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఇదే తేదీన టోర్నమెంట్ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చాడు.
ఈసారి కీలక మార్పులు ఉండవు..
అరుణ్ ధుమాల్ కొన్ని కీలక మార్పుల వార్తలను ఖండించారు. ఈ సీజన్‌లో నియమాలలో గణనీయమైన మార్పు ఉండదని తెలిపాడు. 2023లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కొనసాగుతుందని ఇది సూచిస్తుందని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన సంసద్ ఖేల్ మహాకుంభ్ మూడో ఎడిషన్‌లో ధుమాల్ విలేకరులతో మాట్లాడారు. కొత్తదేమీ లేకపోయినా వచ్చే సీజన్‌లో గత సీజన్ కంటే మెరుగ్గా ఉంటుందని తెలిపాడు.
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 షెడ్యూల్..
IANSతో మాట్లాడుతూ.. “చూడండి, ఐపీఎల్ సీజన్ మార్చిలో ప్రారంభమవుతుంది. మార్చి 21న తేదీని ఖరారు చేసి మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నారు. నిబంధనలలో పెద్దగా మార్పు లేదు. IPL అనేది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన క్రికెట్ లీగ్. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్ళు వచ్చి ఆడతారు. ఈ టోర్నమెంట్ చాలా పోటీతత్వంతో నిర్వహిస్తాం. తప్పకుండా ఈసారి మరింత మెరుగ్గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ధర్మశాలలో 3 మ్యాచ్‌లు..
రాబోయే సంవత్సరంలో ధర్మశాలలో మరిన్ని దేశవాళీ మ్యాచ్‌లతోపాటు దాదాపు మూడు IPL మ్యాచ్‌లు జరుగుతాయని ధుమాల్ చెప్పుకొచ్చాడు. “ఖచ్చితంగా ఇక్కడ బిలాస్‌పూర్‌లో చాలా జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తాం. తదుపరిసారి కూడా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, బిలాస్‌పూర్‌లో ఏ మ్యాచ్‌లు ఆడినా కచ్చితంగా ఆఫర్ వస్తుంది. ధర్మశాలకు కూడా మ్యాచ్‌లు రావడంతో పాటు ఖచ్చితంగా ఆఫర్‌ను పొందే ప్రయత్నం ఇది. గత సారి రెండు (ఐపీఎల్ మ్యాచ్‌లు), ఈసారి మూడు మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నాం’ అంటూ తెలిపాడు.
పంజాబ్ కింగ్స్‌కి ధర్మశాల రెండో హోమ్ గ్రౌండ్..
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పంజాబ్ కింగ్స్ (PBKS)కి రెండవ హోమ్ గ్రౌండ్. దాని మ్యాచ్‌లు కొన్ని ఇక్కడ నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ మద్దతుతో చేపట్టిన సంసద్ ఖేల్ మహాకుంభ్ మూడో ఎడిషన్ ప్రారంభమైంది. బిలాస్‌పూర్ క్రికెట్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన క్రికెట్ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 45 జట్లు పాల్గొంటున్నాయి. ఇది మార్చి వరకు కొనసాగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..