Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్.. కట్ చేస్తే.. థర్డ్ అంపైర్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!

SRH vs GT మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అవుట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. థర్డ్ అంపైర్ తీర్పుపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ టైటాన్స్ శుభ్‌మాన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తమ మూడవ విజయాన్ని నమోదు చేసింది. SRH బ్యాటింగ్ విఫలమై 152 పరుగులకే పరిమితమైంది, దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

Video: ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్.. కట్ చేస్తే.. థర్డ్ అంపైర్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
Washington Sundar
Follow us
Narsimha

|

Updated on: Apr 07, 2025 | 11:41 AM

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కేవలం ఆటపైనే కాకుండా, థర్డ్ అంపైర్ నిర్ణయంపై కూడా విపరీతంగా చర్చకు దారి తీసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఔట్ కావడం తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. SRH నాలుగో స్థానంలో వచ్చిన వాషింగ్టన్ అద్భుతంగా ఆడి, 29 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టు స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే, మహ్మద్ షమీ వేసిన షార్ట్ బంతిని వాషింగ్టన్ స్వీపర్ కవర్ దిశగా ఆడగా, అనికేత్ వర్మ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ క్లీన్‌గా అందుకున్నాడా లేదా అన్న దానిపై అంపైర్లు సందిగ్ధంలో పడ్డారు. దీనితో థర్డ్ అంపైర్ సమీక్ష. కొన్ని రీప్లేల్లో బంతి నేలను తాకినట్టు అనిపించింది, థర్డ్ అంపైర్ వాషింగ్టన్ అవుట్ అనే నిర్ణయాన్ని ఇచ్చాడు. ఈ తీర్పు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని రేపింది. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, థర్డ్ అంపైర్ కచ్చితంగా తగిన నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడ్డారు.

ఈ వివాదానికి మధ్యే, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలిచి మూడవ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 20 బంతులు మిగిలిన దశలో విజయవంతంగా ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తన అజేయ 61 పరుగులతో జట్టు విజయానికి ఆదర్శంగా నిలిచాడు. అతను 43 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు, GT బౌలర్లలో మహ్మద్ సిరాజ్ తన బెస్ట్ ఫామ్‌ను ప్రదర్శించాడు. అతను దూకుడుగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన SRH జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి నాలుగు ఓవర్లలోనే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. షమీ (2/28) మరియు పాట్ కమ్మిన్స్ (1/26) తమ అద్భుతమైన లెంగ్త్ బంతులతో SRH టాప్ ఆర్డర్‌ను వెంటనే దెబ్బతీశారు. అయినా కూడా వాషింగ్టన్ సుందర్ ధైర్యంగా ఎదురొడి జట్టును కొంతమేర నిలబెట్టాడు. కానీ, తన అవుట్ వ్యవహారంతో ఆయన ఇన్నింగ్స్ వివాదంగా మారింది. SRH చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయింది 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాయి కిషోర్ (2/24), ప్రసిద్ధ కృష్ణ (2/25) లాంటి బౌలర్లు గుజరాత్ విజయానికి తోడుగా నిలిచారు.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..