Virat Kohli : 16 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాపై మ్యాచ్.. విరాట్ కోహ్లీ అక్టోబర్ 25 రికార్డును చెరిపేస్తాడా?
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ శుక్రవారం (అక్టోబర్ 25, 2025) నాడు సిడ్నీలో ఆస్ట్రేలియాపై కీలకమైన మూడో వన్డే ఆడేందుకు బరిలోకి దిగాడు. గత రెండు వన్డేలలో (పెర్త్, అడిలైడ్) డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీపై.. ఈ చివరి మ్యాచ్‌లో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, కోహ్లీకి అక్టోబర్ 25 తేదీ అస్సలు కలిసి రాలేదనే రికార్డు ఉంది.

Virat Kohli : టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ శుక్రవారం (అక్టోబర్ 25, 2025) నాడు సిడ్నీలో ఆస్ట్రేలియాపై కీలకమైన మూడో వన్డే ఆడేందుకు బరిలోకి దిగాడు. గత రెండు వన్డేలలో (పెర్త్, అడిలైడ్) డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీపై.. ఈ చివరి మ్యాచ్‌లో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, కోహ్లీకి అక్టోబర్ 25 తేదీ అస్సలు కలిసి రాలేదనే రికార్డు ఉంది. తన కెరీర్‌లో ఈ తేదీన ఆడిన వన్డేలలో కోహ్లీ అత్యధిక స్కోరు కేవలం 30 పరుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఆస్ట్రేలియాపై కోహ్లీ ఈ ప్రతికూల రికార్డును ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి తన వన్డే కెరీర్‌లో అక్టోబర్ 25 తేదీ అనుకూలించలేదనే రికార్డు ఉంది. కోహ్లీ తన కెరీర్‌లో ఈ తేదీన ఇప్పటివరకు 4 వన్డేలు ఆడాడు, కానీ కేవలం 66 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే, సగటున ఒక మ్యాచ్‌లో 20 పరుగులు కూడా చేయలేదు. ఈ నాలుగు మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు కేవలం 30 పరుగులు మాత్రమే. ఇది 2009 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో చేశాడు.
అక్టోబర్ 25న కోహ్లీ ఆడిన గత వన్డేల్లో అతని ప్రదర్శన చూస్తే, రికార్డు మరీ నిరాశజనకంగా ఉంది. 2011లో ఇంగ్లాండ్‌పై ఆడిన వన్డేలో కోహ్లీ ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. నాలుగేళ్ల తర్వాత 2015లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో అతను 7 పరుగులు మాత్రమే చేశాడు. అంటే, కనీసం డబుల్ డిజిట్ స్కోరును కూడా అందుకోలేకపోయాడు. 2017లో న్యూజిలాండ్‌తో ఆడిన నాలుగో వన్డేలో కూడా కోహ్లీ కేవలం 29 పరుగులు చేసి అవుటయ్యాడు. అంటే, ఇప్పటివరకు అక్టోబర్ 25న ఆడిన నాలుగు వన్డేలలో ఆస్ట్రేలియాపై చేసిన 30 పరుగులే అతని అత్యధిక స్కోరుగా ఉంది.
దాదాపు 16 సంవత్సరాల తర్వాత, మళ్లీ అక్టోబర్ 25 నాడు ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆడటానికి కోహ్లీ బరిలోకి దిగాడు. ప్రస్తుత సిరీస్‌లో (పెర్త్, అడిలైడ్) అతను వరుసగా రెండు డకౌట్‌లతో వెనుదిరిగిన నేపథ్యంలో ఈ మ్యాచ్ అతనికి చాలా కీలకం. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ గత పది ఇన్నింగ్స్‌లలో పెద్ద స్కోరు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ పది ఇన్నింగ్స్‌లలో అతను చేసింది కేవలం 90 పరుగులు మాత్రమే. అంతేకాకుండా సిడ్నీ మైదానంకోహ్లీకి తన కెరీర్‌లో అత్యంత తక్కువ రికార్డు ఉన్న వేదికలలో ఒకటి. అందుకే, ఈరోజు అక్టోబర్ 25న ఆస్ట్రేలియాపై భారీ స్కోరు సాధించాలంటే కోహ్లీ తన ముందున్న ఈ ప్రతికూల రికార్డులన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




